కర్ణాటక రాష్ట్రం హుబ్బిళి జిల్లా ధరోజీ గ్రామం వద్ద దేవసముద్రం అనే ఓ చిన్న గ్రామం ఉంది. అక్కడ ఉండే వీరస్వామి (92).. కంటిలో శుక్లాలు తీయించుకునేందుకు అల్లుడితో కలిసి మార్చి నెలలో ఏపీలోని గుంటూరు జీజీహెచ్‌కు వచ్చాడు. వైద్యులు 20 రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పగా.. వీరస్వామిని అల్లుడు జీజీహెచ్‌లోనే వదిలేసి మహారాష్ట్రకు వెళ్లిపోయాడు.
ఇంతలో కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన ఈ పెద్దాయన ఏం చేయాలో తెలియక ఓ బ్యాగ్ పట్టుకుని 5నెలలుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు వీరస్వామి.
ఈ వయసులో కూడా ఆ పెద్దాయన తన ఊరిపేరును, ఇతర వివరాలను స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. లారీల ద్వారా వెళ్దామంటే కరోనాకు భయపడి ఎవరూ ఎక్కించుకోవటం లేదని వాపోతున్నాడు. ప్రస్తుతం అమరావతి రోడ్డులో ఉన్న హోసన్న మందిరం వద్ద భోజనం చేస్తూ అక్కడే సేద తీరుతున్నాడు.
ఇదీ చూడండి: