గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూసాపేట జనతానగర్ జలమండలి కార్యాలయంలో వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తి వాటర్ టాంకర్ నిర్వహిస్తున్నాడు. ఆ ట్యాంకర్‌కు డ్రైవర్‌గా విజయ్ పనిచేస్తున్నాడు. గురువారం కాలనీలకు నీటిని అందించేందుకు ట్యాంకర్‌లోకి నీటిని నింపుతున్న సమయంలో విజయ్ అందులో కాళ్ళు కడుక్కున్నాడు. డ్రైవర్ కాళ్ళు కడుగుతున్న సమయంలో సమీపంలో ఉన్న వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాద్యమంలో పెట్టారు. సాయంత్రానికి విడియో వైరల్ అవ్వడం వల్ల జలమండలి అధికారులు స్పందించారు. ఫలితంగా వెంకటేష్ యాదవ్ ట్యాంకర్‌ను జలమండలి ట్యాంకర్ జాబితా నుంచి తొలగించారు.
ఇవీ చూడండి : కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్