తాను చెప్పినట్లు వినకపోతే కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించి బాలికపై ఓ ఉన్మాది లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె ఇంటికి సమీపంలో ఉన్న, వరసకు మేనమాయ్యే సోమయ్య ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల నుంచి ఆమెతో చరవాణిలో తరచుగా మాట్లాడేవాడు. కొద్ది రోజుల నుంచి మనం వివాహం చేసుకుందామని... తుకారం నివేదిక నగర్లో అద్దె ఇల్లు తీసుకుని ఉందామని మాయ మాటలతో ఆ యువతిని వేధిస్తున్నాడు. తాను చేప్పినట్లు చేయకపోతే ఆ బాలిక కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు. ఆ బాలిక ఇంట్లో కళాశాలకు వెళ్తున్నట్లు చెబుతూ అతనితో తుకారం గేట్‌కు వెళ్లేది. ఈ క్రమంలో పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఇలా తరచు జరిగేది.
అదే గ్రామానికి చెందిన కొందరు ఆ బాలికను ఉప్పల్ వద్ద చూశామని కుటుంబ సభ్యులు చెప్పారు. వారు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కుటుంబీకులు స్థానికంగా ఉన్న ఆత్మకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసును తుకారాంగేట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రజాస్వామ్య భారతాన్ని కాపాడుకోలేమా?