ETV Bharat / city

దుర్గం చెరువు తీగల వంతెనపై అర్ధరాత్రి డ్యాన్స్​ చేస్తూ వీడియో... - సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీస్​ వీడియో

దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జిపై ఆకతాయిల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నామని తెలిసి కూడా కొందకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.

dance
dance
author img

By

Published : Aug 6, 2021, 8:49 PM IST

దుర్గం చెరువు తీగల వంతెనపై అర్ధరాత్రి నృత్యం చేసుకుంటూ వీడియో తీసుకుంటున్న ఓ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తీగల వంతెనపైకి వచ్చిన సదరు యువకుడు.. రహదారి మధ్యన నిలబడి నృత్యం చేశాడు. ఆ దృశ్యాలను అతని స్నేహితుడు చరవాణిలో చిత్రీకరించాడు.

ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రమాదాలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశంతో తీగల వంతెనపై పాదచారులను అనుమతించడం లేదు. తీగలవంతెన వద్ద ప్రకృతి అందాలను చూడాలనే పాదచారులకు ప్రత్యేక బాట ఏర్పాటు చేశారు. పాదచారులు ఆ మార్గం మీదుగానే రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది. కానీ తీగల వంతెన మీద వాహనాలు వచ్చిపోయే దారిపైకి వచ్చి సందర్శకులు సెల్ఫీలు దిగుతూనే ఉన్నారు.

ఒకరి నిర్లక్ష్యం కాకూడదు మరొకరికి ప్రాణసంకటం

ఇదీ చూడండి: Crime: సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.