ETV Bharat / city

మంచినీటి చెరువు ఆవేదన.. ఆలోచింపజేస్తున్న ఫ్లెక్సీ..

Lake expressed Pain: 'గుడిని, బడిని, ఇంటిని శుభ్రం ఉంచుకుంటారు.. కానీ నన్ను మాత్రం గాలికి వదిలేశారు.. నన్ను అభివృద్ధి చేయకపోగా.. ఆక్రమించుకుంటున్నారు.. నన్ను జాగ్రత్తగా చూసుకుంటే.. ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్ తరాలను సైతం కాపాడాతాను'.. అని ఓ చెరువు తన ఆవేదనను ఫ్లెక్సీ రూపంలో బయటపెట్టింది. మంచినీటి చెరువే తన బాధను వర్ణిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫ్లెక్సీ.. అటుగా వెళ్లే వారందరినీ ఆలోచింపజేస్తోంది.

author img

By

Published : Jul 8, 2022, 4:43 PM IST

సిరిపురం
సిరిపురం

Lake expressed Pain: ఏపీలో గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలోని మంచినీటి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.. అటుగా వెళ్లే వారందరినీ ఆలోచింపజేస్తుంది. ప్రజలు తమ స్వార్థం కోసం చేస్తున్న పనులు.. తనకు ఎంతో బాధ కల్గిస్తున్నాయని.. చెరువు తన ఆవేదనను చెప్పినట్లుగా కొంతమంది ఆ ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేశారు.

"నా మీద చెత్త, వ్యర్థపదార్థాలు వేశారు. మద్యపానం సేవించి ఖాళీ సీసాలను నా మీదకి విసిరి.. నన్ను తాగుబోతును చేశారు.. అయినా భరించాను. గ్రూప్ రాజకీయలు చేసి.. నన్ను అభివృద్ధి చేయటం మరిచిపోయారు. అయినప్పటికీ నేను సహించాను. ఇప్పుడు ఏకంగా స్వప్రయోజనాల కోసం నా మీద అక్రమ కట్టడాలు కడుతూ.. నన్ను ఆక్రమిస్తున్నారు. మీరు చేస్తున్న పనులు నాకు ఎంతో బాధను కల్గిస్తున్నాయి. గుడిని, బడిని, ఇంటిని శుభ్రం చేసినట్లుగా.. దయచేసి నన్ను పరిశుభ్రం చేయండి. నన్ను అభివృద్ధి చేసి.. జాగ్రత్తగా చూసుకుంటే.. నేను మన గ్రామాన్ని, మిమల్ని... భవిష్యత్ తరాలను కాపాడతానని హామీ ఇస్తున్నాను. కుల, మత రాజకీయలకు అతీతంగా నన్ను అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ"... మీ సిరిపురం మంచి నీటి చెరువు

ఇదీ చదవండి: పెండింగ్​ హామీలపై దృష్టి సారించిన సర్కారు..

జర్నలిస్ట్​ మహ్మద్​ జుబైర్​కు సుప్రీంలో ఊరట.. పోలీసులకు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.