ETV Bharat / city

Ramayanam on silk clothes: చేనేత అద్భుత సృష్టి.. పలు భాషల్లో పట్టువస్త్రంపై శ్రీరామ కోటి - Ramayana scenes on silk cloth

Ramayanam on silk clothes: ఆంధ్రప్రదేశ్​లోని సత్యసాయి జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు పట్టు వస్త్రంపై రామాయణ ఘట్టాలను రూపొందించి అబ్బురపరిచారు. 60 మీటర్ల పట్టువస్త్రంపై పలుభాషల్లో శ్రీరామ నామాలు డిజైన్ చేశారు. శ్రీ రామ కోటి పట్టు వస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నట్లు నాగరాజు తెలిపారు.

Ramayanam on silk clothes
పలు భాషల్లో పట్టువస్త్రంపై శ్రీరామ కోటి
author img

By

Published : Apr 14, 2022, 6:40 PM IST

Ramayanam on silk clothes: ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కళాకారుడు నాగరాజు... రామ కోటి పట్టువస్త్రాన్ని చేనేత మగ్గంపై రూపొందించి అబ్బురపరిచారు. శ్రీరాముని జీవిత చరిత్ర తెలిపే చిత్రాలను పట్టు వస్త్రం అంచుల మీద రెండు వైపులా రూపొందించారు. 60 మీటర్ల పట్టువస్త్రం మధ్యలో జై శ్రీరామ్ అక్షరమాలను తెలుగుతో పాటు పలు భాషల్లో కలిపి 32,200 అక్షరాలను డిజైన్ చేశారు.

చేనేత అద్భుత ప్రతిభ.. పట్టువస్త్రంపై శ్రీరామకోటి

మొత్తం 16 కిలోల బరువు కలిగిన వస్త్రాన్ని తయారు చేసేందుకు నాలుగు నెలల సమయం పట్టిందని చేనేత కళాకారుడు నాగరాజు పేర్కొన్నారు. శ్రీ రామకోటి పట్టు వస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నట్లు తెలిపారు. చేనేత ప్రతిభను పలువురు మెచ్చుకుంటున్నారు. తన కళతో శ్రీరాముడిపై ఉన్న భక్తిని అద్భుతంగా చాటుకున్నారని ప్రశంసించారు.

ఇదీ చదవండి: Praja Sangrama Yatra: బండి సంజయ్​ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- నలుగురు ముష్కరులు హతం

Review: 'కేజీఎఫ్'కి దీటుగా 'కేజీఎఫ్​ 2'.. ఇక బాక్సాఫీస్​ బద్దలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.