ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజుపల్లిలో ఓ ఆవు ఒకేసారి మూడు దూడలకు జన్మనిచ్చింది. వాటిలో రెండు పెయ్యలు, ఒక కోడెదూడ ఉన్నాయి. గ్రామానికి చెందిన రాజనాల కొండలుకు మూడేళ్ల క్రితం ఆవుదూడను కొన్నారు.
అది ఇటీవలే మూడు దూడలను ఈనటం విశేషం. దూడలను పశువైద్యాధికారి శ్రీనివాసరావు పరీక్షించారు. అన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయని తెలిపారు. పిండం విడిపోవటం వల్లే ఇలా ఒకటి కంటే ఎక్కువ జన్మిస్తాయని వివరించారు.
ఇదీ చదవండి: గుంటూరు పారిశ్రామికవాడలను పరిశీలించిన ఏపీసీపీడీసీఎల్ సీఎండి