ETV Bharat / city

3PM TOPNEWS: టాప్​న్యూస్@3PM - 3PM TOPNEWS

3PM TOPNEWS: టాప్​న్యూస్@3PM

3pm topnews
3pm topnews
author img

By

Published : Jun 16, 2022, 2:58 PM IST

  • రాజ్​భవన్ వద్ద రణరంగం..

కాంగ్రెస్‌ రాజ్‌భవన్‌ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగిస్తోంది. ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్‌భవన్ ముట్టడించేందుకు... నేతలు ప్రయత్నించగా... నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.

  • 'నన్నే పట్టుకుంటావా.. స్టేషన్​కు వచ్చి మరీ కొడతా..'

రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై నిరసనగా రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన ఆందోళన రణరంగంలా మారింది. రాజ్​భవన్ ముట్టడించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

  • బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల కౌంటర్ పిటిషన్

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో రోజురోజుకు దర్యాప్తు వేగంగా సాగుతోంది. తాజాగా నిందితులు ఈ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టులో ఏ-1 సాదుద్దీన్ మాలిక్ బెయిల్ పిటిషన్ వేశారు.

  • త్వరలోనే భారత్​లో '5G'..

దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరో కీలక ముందడుగు పడింది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలో 5G విషయంలో చాలా మందికి ఉన్న సందేహాలు తీర్చే ప్రయత్నమే ఇది.. దాంతోపాటు 5G ఉపయోగాలు కూడా ఓ సారి తెలుసుకుందా రండి.

  • రూ.500 కొడితే 2500.. ఆ ఏటీఎంకు ఎగబడ్డ జనం!

మీకు ఏటీఎంలో ఎప్పుడైనా ఎంటర్​ చేసిన అమౌంట్​ కంటే.. ఎక్కువ డబ్బులు వచ్చాయా? అలా జరిగి ఉండదులే. కానీ ఓ వ్యక్తి రూ. 500 తీసుకుందామని వెళ్తే.. 2500 రూపాయలు వచ్చాయి. అంటే 5 రెట్లు అధికంగా డబ్బు పొందాడు. అంతే.. ఆ ఏటీఎంకు వందలాదిగా క్యూ కట్టారు జనం. ఇది ఎక్కడ జరిగిందంటే?

  • దుస్తులు చించేశారని మహిళా ఎంపీ ఆరోపణ..

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని విచారించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బుధవారం నిరసనల సందర్భంగా.. తమపై దిల్లీ పోలీసులు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారని ఆరోపించారు కాంగ్రెస్​ నేతలు. తన దుస్తులను చించేసినట్లు సంచనల ఆరోపణలు చేశారు కరూర్​ ఎంపీ జ్యోతిమణి.

  • బుల్​డోజర్లతో కూల్చివేతలు ఆపలేం.. కానీ...: సుప్రీంకోర్టు

హింసాత్మక ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను బుల్​డోజర్లతో కూల్చివేసే విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే కచ్చితంగా చట్టంలోని నియమాలు, నిబంధనలను అనుసరించే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరగాలని స్పష్టం చేసింది.

  • ఇంగ్లాండ్​కు టీమ్​ఇండియా..

ఇంగ్లాండ్​తో గతేడాది జరిగిన టెస్టు సిరీస్​లో మిగిలి ఉన్న ఆఖరి మ్యాచ్​ను ఆడేందుకు టీమ్​ఇండియా రెడీ అయింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఆ మ్యాచ్​ జూలై 1న జరగనుంది. గతేడాది సిరీస్​ జరిగిన సమయంలోను ఇప్పటికీ పోలిస్తే ఇరు జట్లలో చాలా మార్పులు జరిగాయి.

  • అవకాశం వస్తే ఆ పాత్ర చేయడానికైనా సిద్ధమే: రాశీఖన్నా

ఇప్పటివరకు తాను పోషించిన పాత్రలన్నింటిలోకెల్లా 'పక్కా కమర్షియల్‌'లో చేసిన ఝాన్సీ పాత్ర ది బెస్ట్ అని అన్నారు నటి రాశీఖన్నా. ఈ రోల్​ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారని చెప్పారు. ఇంకా తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేసిన పాత్రలు, ఇష్టాయిష్టాలు పంచుకున్నారు.

  • ప్రయాణికులకు షాక్.. 'టికెట్ రేట్లు 15% పెంపు!'

విమాన ఇంధన ధరలు 16 శాతం మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర జీవితకాల గరిష్ఠానికి చేరింది. ఈ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు.. టికెట్ల ధరలను పెంచాలని కోరుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.