ETV Bharat / city

Telangana Top News: టాప్​ న్యూస్ @3PM - 3pm topnews

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3pm topnews
3pm topnews
author img

By

Published : Jun 26, 2022, 2:58 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి సంచరిస్తోంది. నిన్న రాత్రి కమలాపూర్- బాంబుల గడ్డ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా ఆమార్గంలో వచ్చిన బస్సులోని ప్రయాణికులు చూశారు.

  • రంగంలోకి రష్మీ..

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. శివసేన రెబల్​ ఎమ్మెల్యేలు పట్టువీడటం లేదు. ఏక్​నాథ్​ శిందేతోనే ఉంటామంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. రెబల్​ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వారి భార్యలతో మాట్లాడుతున్నారు.

  • ఏనుగుల బీభత్సం.. కార్లపై దాడి..

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుపిల్లతో సహా రోడ్డుపైకి వచ్చిన రెండు గజరాజులు కార్లపై దాడి చేశాయి. ఈ ఘటనలో పోలీసు కారు తప్పించుకోగా మరో కారు ధ్వంసం అయ్యింది.

  • కులం, మతం లేని ధ్రువపత్రం..

కులం, మతం లేని ధ్రువపత్రాన్ని తీసుకున్నారు తమిళనాడులోని దంపతులు. వారి పిల్లలకు సైతం కులం, మతం లేని ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరు తీసుకున్న నిర్ణయం పట్ల పలువురి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

  • వారంలో 4 రోజులే పని.. జీతం తక్కువ..

నూతన కార్మిక చట్టాలను జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అయితే కొత్త చట్టాలపై ప్రైవేటు ఉద్యోగులకు అనేక సందేహాలున్నాయి. కొత్త చట్టాల్లో ఏముంది? రోజువారీ పనివేళలు, వీక్లీఆఫ్​ల పరిస్థితేంటి? జీతం ఏమైనా తగ్గుతుందా? రిటైర్మెంట్​ తర్వాత గ్రాట్యూటీ పెరుగుతుందా? సెలవుల సంగతేంటి? ఈ సందేహలపై సమాధానాలు తెలుసుకుందాం రండి.

  • భళా హర్మన్​ప్రీత్

టీమ్​ఇండియా మహిళా టీ20 జట్టు కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్..​ మాజీ ప్లేయర్​ మిథాలీ రాజ్​ రికార్డ్​ను బద్దలుకొట్టింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో చెలరేగిన హర్మన్​ప్రీత్​.. అత్యధిక పరుగులు చేసిన భారత టీ20 బ్యాటర్​గా నిలిచింది. 123 మ్యాచుల్లో 2372 పరుగులు చేసింది.

  • మాధవన్​పై నెటిజన్లు ఫైర్..

ప్రముఖ నటుడు మాధవన్​ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితం ఆధారంగా ఆయన తెరకెక్కించిన 'రాకెట్రీ' ప్రమోషన్స్​లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.

  • బండ్ల గణేశ్​కు పూరి స్ట్రాంగ్​ కౌంటర్​?

ఆకాష్ నటించిన 'చోర్​ బజార్'​ ప్రీరిలీజ్​ ఈవెంట్​లో పూరి జగన్నాథ్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు నిర్మాత బండ్ల గణేశ్​. పూరి.. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. దీంతో ఇటీవలే విడుదల చేసిన ఓ పాడ్​కాస్ట్​లో గణేశ్​ను ఉద్దేశించి పూరి గట్టిగా కౌంటర్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. చీప్ మాటలు, ప్రవర్తన వద్దని అందులో చురకలంటించారు!

  • ఎమ్మెల్యే బీరం అరెస్టు.. బ్యాంక్​ ఆధారాలతో జూపల్లి..

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో నేతల ఆధిపత్య పోరు ఫలితమే ఈ ఉద్రిక్తత. కొన్నేళ్లుగా ఎడమొహం -పెడమొహంగా ఉన్న ఇద్దరు నేతలు... ఇటీవల ఒకరిపై ఒకరు బహిరంగంగానే పరస్పర, వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.

  • ఎన్​హెచ్​ఆర్సీకి బండి సంజయ్ ఫిర్యాదు

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు బండి సంజయ్‌ ఫిర్యాదు చేశారు. కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు విధించిన నిబంధనలపై దర్యాప్తు చేయాలన్నారు.

  • భూపాలపల్లి జిల్లాలో పులి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి సంచరిస్తోంది. నిన్న రాత్రి కమలాపూర్- బాంబుల గడ్డ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా ఆమార్గంలో వచ్చిన బస్సులోని ప్రయాణికులు చూశారు.

  • రంగంలోకి రష్మీ..

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. శివసేన రెబల్​ ఎమ్మెల్యేలు పట్టువీడటం లేదు. ఏక్​నాథ్​ శిందేతోనే ఉంటామంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. రెబల్​ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వారి భార్యలతో మాట్లాడుతున్నారు.

  • ఏనుగుల బీభత్సం.. కార్లపై దాడి..

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుపిల్లతో సహా రోడ్డుపైకి వచ్చిన రెండు గజరాజులు కార్లపై దాడి చేశాయి. ఈ ఘటనలో పోలీసు కారు తప్పించుకోగా మరో కారు ధ్వంసం అయ్యింది.

  • కులం, మతం లేని ధ్రువపత్రం..

కులం, మతం లేని ధ్రువపత్రాన్ని తీసుకున్నారు తమిళనాడులోని దంపతులు. వారి పిల్లలకు సైతం కులం, మతం లేని ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరు తీసుకున్న నిర్ణయం పట్ల పలువురి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

  • వారంలో 4 రోజులే పని.. జీతం తక్కువ..

నూతన కార్మిక చట్టాలను జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అయితే కొత్త చట్టాలపై ప్రైవేటు ఉద్యోగులకు అనేక సందేహాలున్నాయి. కొత్త చట్టాల్లో ఏముంది? రోజువారీ పనివేళలు, వీక్లీఆఫ్​ల పరిస్థితేంటి? జీతం ఏమైనా తగ్గుతుందా? రిటైర్మెంట్​ తర్వాత గ్రాట్యూటీ పెరుగుతుందా? సెలవుల సంగతేంటి? ఈ సందేహలపై సమాధానాలు తెలుసుకుందాం రండి.

  • భళా హర్మన్​ప్రీత్

టీమ్​ఇండియా మహిళా టీ20 జట్టు కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్..​ మాజీ ప్లేయర్​ మిథాలీ రాజ్​ రికార్డ్​ను బద్దలుకొట్టింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో చెలరేగిన హర్మన్​ప్రీత్​.. అత్యధిక పరుగులు చేసిన భారత టీ20 బ్యాటర్​గా నిలిచింది. 123 మ్యాచుల్లో 2372 పరుగులు చేసింది.

  • మాధవన్​పై నెటిజన్లు ఫైర్..

ప్రముఖ నటుడు మాధవన్​ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితం ఆధారంగా ఆయన తెరకెక్కించిన 'రాకెట్రీ' ప్రమోషన్స్​లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.

  • బండ్ల గణేశ్​కు పూరి స్ట్రాంగ్​ కౌంటర్​?

ఆకాష్ నటించిన 'చోర్​ బజార్'​ ప్రీరిలీజ్​ ఈవెంట్​లో పూరి జగన్నాథ్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు నిర్మాత బండ్ల గణేశ్​. పూరి.. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. దీంతో ఇటీవలే విడుదల చేసిన ఓ పాడ్​కాస్ట్​లో గణేశ్​ను ఉద్దేశించి పూరి గట్టిగా కౌంటర్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. చీప్ మాటలు, ప్రవర్తన వద్దని అందులో చురకలంటించారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.