ETV Bharat / city

Students Reached Hyderabad: ఐదో విమానంలో దిల్లీ వచ్చిన 16 మంది తెలుగు విద్యార్థులు - ఉక్రెయిన్​ నుంచి హైదరాబాద్​కు విద్యార్థులు

Students Reached Hyderabad : యుద్ధ వాతావరణంలో క్షణక్షణం భయంభయంగా గడిపారు. భీకర పరిస్థితుల నుంచి ఎట్టకేలకు బయటపడి స్వదేశం చేరుకున్నారు. కొద్దిరోజులుగా బాంబుల మోతతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌ నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలను చూసి భావోద్వేగానికి గురై గుండెలకు హత్తుకున్నారు.

Students
Students
author img

By

Published : Feb 28, 2022, 8:02 AM IST

Updated : Feb 28, 2022, 9:50 AM IST

Students Reached Hyderabad: ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. బుకారెస్ట్‌ నుంచి 249 మంది భారతీయులతో ఐదో విమానం దిల్లీ చేరుకుంది. వీరిలో 16 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారిలో 11 మంది తెలంగాణ, ఐదుగురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. దిల్లీకి చేరుకున్న విద్యార్థులు హైదరాబాద్​, తిరుపతికి బయలుదేరారు.

ఇప్పటికే ఇంటికి చేరిన 39 మంది..

ఉక్రెయిన్‌ నుంచి దిల్లీకి 25 మంది, ముంబయికి 14 మంది రాగా.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు ముంబయిలో వసతి ఏర్పాట్లు చేశారు. దిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. వారందర్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విమానాల్లో ఉచితంగా శంషాబాద్‌కు తీసుకొచ్చింది. శంషాబాద్‌లో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. తమను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాయబార కార్యాలయ అధికారులకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఇంకా ఉన్న వారినీ సురక్షితంగా తీసుకొస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన విద్యార్థుల వివరాలను ఆయన ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు అందించారు.

..

తీవ్రంగా ఆందోళన చెందాం

కొంత మంది విద్యార్థులు రాష్ట్రానికి చేరుకున్నా ఇంకా అనేకమంది ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు.

సుప్రియ, శేరిలింగంపల్లి

చెర్నవిట్స్‌ ప్రాంతంలోని బుకోవినియన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ ఐదో సంవత్సరం చదువుతున్నా. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో భీకర యుద్ధం సాగుతోంది. మేము ఉండే పశ్చిమ ప్రాంతంలో యుద్ధ వాతావరణం లేదు. అక్కడ కూడా ఆరంభమయ్యేలోపు ఎలా బయటపడాలా అని ఆందోళనపడ్డాం. మేము ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉండే రుమేనియాకు త్వరగా చేరుకోగలిగాం. అక్కడి నుంచి ముంబయికి.. ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకున్నాం. ఇంకా 2 వేల విద్యార్థులు అక్కడే ఉన్నారు. - సుప్రియ, శేరిలింగంపల్లి

30 గంటలు బస్సులోనే

ఉజ్రాద్‌ వర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాను. స్వదేశానికి వచ్చేందుకు టిక్కెట్లు బుక్‌ చేసుకుని.. 23న కీవ్‌ విమానాశ్రయానికి వెళ్లాం. విమానాలు రద్దు కావడంతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాం. వారి సూచన మేరకు.. రొమేనియాకు బస్సులో బయలుదేరాం. ట్రాఫిక్‌ రద్దీ వల్ల 30 గంటలు ప్రయాణించాల్సి వచ్చింది. మధ్యలో దొరికింది తిన్నాం. సరిహద్దుకు 8 కి.మీ.ల దూరంలోనే వదిలిపెట్టారు. అక్కడి నుంచి కాలినడకన రొమేనియా విమానాశ్రయానికి చేరుకున్నాం. మూడు రోజుల ప్రయాణం తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్‌ రాగలిగాం. - రమ్య, షేక్‌పేట

నిత్యావసరాల కొనుగోలుకు రోజుకో గంట

తేజస్విని, ఆర్కే డివిజన్‌, వాసవీ కాలనీ

జపోరిజియా విశ్వవిద్యాలయంలో వైద్యవిద్య చదువుతున్నాను. ప్రతిక్షణం భయంతో బతుకుతున్నాం. ఈ నెల 24 నుంచి కర్ఫ్వూ విధించారు. రోజుకో గంట నిత్యావసరాల కొనుగోలుకు వీలు కల్పిస్తున్నారు. శనివారం వరకు బంకర్లలోనే గడిపాం. ఆదివారం హాస్టల్‌కి వచ్చాం. 40 మంది తెలుగు విద్యార్థులున్నారు. 3-4 రోజుల్లో హైదరాబాద్‌కు పంపిస్తామంటున్నారు. - తేజస్విని, ఆర్కే డివిజన్‌, వాసవీ కాలనీ

బంకర్‌లో 400 మంది ఉన్నాం

అక్షత, నేరడ్‌గాం, నారాయణపేట జిల్లా

జపోరిజియా వర్శిటీలోని బంకర్‌లో వివిధ దేశాలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులం బిక్కుబిక్కుమంటూ ఉన్నాం. మేము ఉంటున్న వసతిగృహంలో 15 రోజులకు సరిపడా సరకులు ఉన్నాయి. కానీ, బయట పరిస్థితులు చూస్తుంటే భయం కలుగుతోంది. స్వదేశానికి రావాలంటే మేమున్న ప్రాంతానికి 400-500 కి.మీ.ల దూరంలోని రొమోనియాకు చేరుకోవాలి. ఎక్కడ బాంబు దాడులు జరుగుతాయోనని జంకుతున్నాం. - అక్షత, నేరడ్‌గాం, నారాయణపేట జిల్లా

ఇదీ చూడండి : Russia-Ukraine conflict: అసలు పోరు పట్టణాల్లో మొదలు!

Last Updated : Feb 28, 2022, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.