IPS promotions: రాష్ట్రానికి చెందిన 20 మంది పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా లభించింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఇండియన్ పోలీసు సర్వీసుకు నియమితులయ్యారు. 2016 నుంచి 2020 బ్యాచ్‌లకు చెందిన మొత్తం 20 మందికి ఐపీఎస్ హోదా దక్కింది.
2016 బ్యాచ్‌కు చెందిన కోటిరెడ్డి, సుబ్బరాయుడు, నారాయణరెడ్డి, డీవీ శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరావు, అన్నపూర్ణ, పద్మజ, జానకి ధరావత్ ఉన్నారు. 2017 బ్యాచ్‌కు చెందిన పి.యాదగిరి, 2018 బ్యాచ్ కేఆర్ నాగరాజు, ఎం.నారాయణ, 2019 బ్యాచ్‌కు చెందిన వి.తిరుపతి, ఎస్.రాజేంద్రప్రసాద్, డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి, కె.సురేష్ కుమార్.. ఐపీఎస్‌హోదా లభించిన వారి జాబితాలో ఉన్నారు. 2020 సంవత్సరానికి సంబంధించి బి.అనురాధ, సి.అనసూయ, షేక్ సలీమా, ఆర్.గిరిధర్, సీహెచ్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. ఐపీఎస్ నిబంధనలకు లోబడి ఈ అధికారులందరూ ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇదీచూడండి: ఆ విషయంలో తెలంగాణ, ఏపీ సామరస్యంగా రాజీ చేసుకోవాలి: కేంద్రం