ETV Bharat / city

నేడు రాష్ట్రంలో 37వేల మందికి టీకాలు - vaccination for private Medical staff

ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకాలు అందించేందుకు వైద్యఆరోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. 400 కేంద్రాల్లో 37వేల మంది ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్​ అనంతరం.. మళ్లీ వరుసగా 4 రోజుల పాటు కొవిడ్​ టీకాల పంపిణీకి విరామం ఉంటుంది.

2 days vaccination in telangana for private Medical staff

author img

By

Published : Jan 28, 2021, 6:43 AM IST

రాష్ట్రంలో కొవిడ్‌ టీకాల పంపిణీ ప్రక్రియ తిరిగి నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 28న 400 కేంద్రాల్లో 37వేల మంది ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకాలను అందించడానికి వైద్యఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 1.55 లక్షల మంది టీకాలను పొందేందుకు కొవిన్‌ యాప్‌లో సమాచారాన్ని పొందుపర్చగా.. వీరిలో 42,915 మందికి సోమవారం టీకాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ... 20,359(47.4 శాతం) మంది మాత్రమే టీకాలు పొందారు.

ఈరోజు నుంచైనా... లక్ష్యానికి సాధ్యమైనంత సమీపంలో టీకాలను అందజేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా మాట్లాడారు. 29న కూడా కొవిడ్‌ టీకా పంపిణీ ఉంటుంది. మళ్లీ 30న సార్వత్రిక టీకా పంపిణీలో భాగంగా కొవిడ్‌ టీకాలకు విరామం.

ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా ఈ నెల 31న పోలియో టీకా పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ తేదీన పోలియో టీకా పొందని చిన్నారుల కోసం.. ఆ తర్వాత వచ్చే నెల 1, 2 తేదీల్లోనూ పోలియో టీకాల పంపిణీ కొనసాగుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. శుక్రవారం తర్వాత మళ్లీ వరుసగా 4 రోజుల పాటు కొవిడ్‌ టీకాల పంపిణీకి విరామం ఉంటుందని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: కొవాగ్జిన్ టీకాకు యూకే స్ట్రైయిన్‌ను చంపే సామర్థ్యం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.