ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజు వ్యవధిలో 51,544 నమూనాలను పరీక్షించగా 1,901 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 8,08,924కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 19 మంది కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు.
చిత్తూరు జిల్లాలో 4, కడప 3, కృష్ణా 3, అనంతపురం 2, తూర్పుగోదావరి 2, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మృతిచెందిన వారి సంఖ్య 6,606కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 3,972 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 28,770 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 76,21,896 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
ఇవీ చూడండి: కొవిడ్ వ్యాక్సిన్ కీలక ప్రయోగాల్లో భాగమవుతారా?