ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గురువారంతో పోలిస్తే.. ఇవాళ కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా మాత్రమే తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఏపీవ్యాప్తంగా 1,00,424 పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 17,188 కేసులు నిర్ధరణ కాగా.. 73 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,86,695 కొవిడ్ క్రియాశీల కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా మరణాలు
గత 24 గంటల వ్యవధిలో విజయనగరంలో అత్యధికంగా 11 మంది మృత్యవాత పడ్డారు. విశాఖలో 10, తూర్పుగోదావరి 8, చిత్తూరు 7, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆరుగురు చొప్పున మృతి చెందారు. పశ్చిమగోదావరి, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారిన పడి అనంతపురం జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు