Food Poison : ఏపీ కర్నూలు జిల్లా ఆదోనిలో పానీ పూరి తిని 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా వాంతులు,విరేచనాలతో ఇబ్బందిపడుతూ ఆదోని ఏరియా ఆసుపత్రిలో చేరారు. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని మండిగిరి ప్రాంతంలో పానీ పూరి తిన్నామని తెలిపారు. రాత్రి చాలాసేపు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డామని, రెండు గంటల సమయంలో ఆసుపత్రిలో చేరినట్లు బాధితులు తెలిపారు.
కలుషిత ఆహారం తిన్న బాధితులు వాంతులతో ఇబ్బంది పడుతూ అర్థరాత్రి సమయంలో ఆసుపత్రిలో చేరారని..ప్రస్తుతం అందరూ చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి : Food Poison: ఉగాది పచ్చడి తాగి 27 మంది విద్యార్థులకు అస్వస్థత