ETV Bharat / city

pattabhi remand: తెదేపా నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్ - పట్టాభికి 14 రోజుల రిమాండ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్​పై అనుచిత వ్యాఖ్యల కేసులో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్​కు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

పట్టాభికి 14 రోజుల రిమాండ్
పట్టాభికి 14 రోజుల రిమాండ్
author img

By

Published : Oct 21, 2021, 6:09 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్​పై అనుచిత వ్యాఖ్యల కేసులో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. పట్టాభిపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ (Remand for tdp leader pattabhi)విధించారు.

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశం

పట్టాభిని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా మచిలీపట్నం జైలుకు తరలించి.. అక్కడ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు పట్టాభిని తరలించనున్నారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను బుధవారం రాత్రి 10 గంటలకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత కథనాలు

TDP leader Pattabhi arrest: తెదేపా నేత పట్టాభి అరెస్టు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.