Ap corona cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య 10వేలకు పైగానే దాటుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,929 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు మృతి చెందగా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
కరోనా నుంచి 5,716 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 101396 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1988 కేసులు నమోదు కాగా, ప్రకాశం 1589, గుంటూరు 1422, అనంతపురం 1345, నెల్లూరు 1305, కర్నూలు 1255, కడప 1083, తూర్పుగోదావరి 1001 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,561 మంది మృతి చెందారు.
దేశంలో ఇలా..
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,55,874 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 614 మంది మరణించారు. 2,67,753 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 3,97,99,202
- మొత్తం మరణాలు: 4,90,462
- యాక్టివ్ కేసులు: 22,36,842
- మొత్తం కోలుకున్నవారు: 3,70,71,898
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 62,29,956 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,92,09,308కు చేరింది.
ఫిబ్రవరి నాటికి..
Covid Third Wave: దేశంలో కొవిడ్ మూడో దశ కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి రోజువారీ కరోనా కేసులు మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. అయితే క్రితం రోజుతో పోల్చితే తాజాగా నమోదైన కేసుల్లో తగ్గుదల కనిపించింది. కొన్ని రాష్ట్రాలు, ముంబయి, దిల్లీ సహా పలు మెట్రో నగరాల్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. ఇది ఇలా కొనసాగితే ఫిబ్రవరి నెల మధ్య నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్లో 41, మధ్యప్రదేశ్‌లో 16 కేసులు వెలుగు చూశాయి. ఈ వేరియంట్లను బీఏ1, బీఏ2, బీఏ3గా గుర్తించారు. వీటి వల్ల ఇప్పటికే బ్రిటన్‌లో వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 20,32,741 మందికి కరోనా సోకింది. 5,920 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 35,48,19,296కి చేరగా.. మరణాలు 56,22,046కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 4,65,154 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 1,193 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7.2 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 1,08,481 కేసులు వెలుగుచూశాయి. మరో 393 మంది చనిపోయారు.
- ఇటలీలో 77,696 కొత్త కేసులు బయటపడగా.. 352 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 90,509 మందికి వైరస్ సోకగా.. 267 మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 78,121 కరోనా కేసులు బయటపడగా.. 276 మంది బలయ్యారు.
- జర్మనీలో 90,962 వేల మందికి వైరస్ సోకింది. మరో 161 మంది మృతి చెందారు.
- బ్రిటన్‌లో మరో 88,447 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 56 మంది మృతి చెందారు.
- స్పెయిల్‌లో తాజాగా 1,01,810 కేసులు బయటపడ్డాయి. మరో 85 మంది మరణించారు.
ఇదీ చూడండి: