ETV Bharat / city

రెండు రోజుల్లో ఏకంగా 118 కేసులు

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 272కు చేరింది. గత రెండు రోజుల్లో ఏకంగా 118 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మృతి చెందారు.

118 cases incresed in last tow days
రెండు రోజుల్లో ఏకంగా 118 కేసులు
author img

By

Published : Apr 5, 2020, 5:56 AM IST

Updated : Apr 5, 2020, 8:53 AM IST

రాష్ట్రంలో కరోనా కేసుల నానాటికి సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 43 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు వైరస్​ సోకిన వారి సంఖ్య 272కి చేరింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 228 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని ప్రభుత్వం తెలిపింది.

మర్కజ్​ ప్రభావం..

ఇటీవల నమోదైన పాజిటివ్ కేసు​లు అన్ని మర్కజ్ నుంచి వచ్చిన వారు, వారిని కలిసిన వారివేనని ప్రభుత్వం పేర్కొంది. షాద్​నగర్​లో, సికింద్రాబాద్​లో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారు కూడా.. దిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తులను కలిసిన వారేనని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మర్కజ్ నుంచి 1090 మంది వచ్చారని... వాళ్లందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మెరుగైన సేవలు అందించేందుకు..

కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. రెండు రోజుల్లో గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తేనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 6 ల్యాబ్​లలో 24 గంటల పాటు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 5 లక్షల ఎన్-95 మాస్క్​లు, 5 లక్షల ఐపీఈ కిట్లు, 5 లక్షల వైరల్ ట్రాన్స్మిషన్ కిట్లు, 500 వెంటిలేటర్లు, నాలుగు లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు, 20 లక్షల సర్జికల్ మాస్క్​లు, 25 లక్షల హాండ్ గ్లౌస్​లు కొనుగోలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇవీ చూడండి: లైట్స్​ ఆపితే పవర్​ గ్రిడ్​పై ప్రభావం పడుతుందా?

Last Updated : Apr 5, 2020, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.