Gold medals: సాధారణ కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు ప్రభుత్వ కళాశాలల్లో చదివినా.. ఉత్తమ ప్రతిభ చూపాడు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో బీవీఎస్సీ డిగ్రీలో ఏకంగా 11 బంగారు పతకాలు సాధించాడు ఉత్తరాఖండ్‌కు చెందిన అమన్ కేఆర్ తివారీ. విశ్వవిద్యాలయ చరిత్రలో ఇదే ప్రథమం. 2016-21 సంవత్సరానికి సంబంధించి వర్సిటీ పరిధిలో ప్రతిభ కనబరిచిన 37 మందికి ఈనెల 7న తిరుపతిలో జరిగిన 11వ స్నాతకోత్సవంలో ఈ పతకాలు అందజేశారు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని పశువైద్య కళాశాలలో 2016లో బీవీఎస్సీలో ప్రవేశం పొందిన అమన్‌ది దేహ్రాదూన్ గ్రామం. ఆయన తండ్రి బ్రజేష్ తివారీ ఓ ప్రైవేటు సంస్థలో సూపర్‌వైజర్. తల్లి కుసుమ్‌దేవి గృహణి. అమన్ పదో తరగతిలో 81శాతం మార్కులు పొందాడు. 12వ తరగతి పరీక్షలో 95.4శాతం మార్కులతో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు. అనంతరం అఖిల భారత ప్రీ వెటర్నరీ టెస్ట్‌లో జాతీయస్థాయిలో 1904 ర్యాంకు సాధించి బీవీఎస్సీ సీటు దక్కించుకున్నాడు. ఐదున్నరేళ్లు విద్యనభ్యసించి 8.44 ఓజీపీఏ సాధించాడు.
ఇవీ చూడండి: