ఆహారపు అలవాట్లలో భాగంగా పరుగు కావాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఫ్రీడమ్ హెల్తీ కూకింగ్ ఆయిల్స్ హైదరాబాద్ 10కె రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో... నెక్లెస్ రోడ్లో నిర్వహించిన 10కె, 5కె పరుగును మంత్రితో పాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సినీ తారలు అవికా గోర్, సంజన జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశ వ్యాప్తంగా 12వేల మంది యువతీ యువకులు పరుగులో పాల్గొన్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం... అనేక రోగాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. దీనికి పరిష్కారం ప్రతి రోజు తప్పనిసరిగా 15 నిమిషాలు నడక తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని... ఎన్ని కోట్లు సంబంధించిన ఆరోగ్యంగా లేకపోతే లాభం లేదన్నారు. అందుకే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో శరవేగంతో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు 17 ఏళ్లుగా హైదరాబాద్ 10కె పరుగు నిర్వహిస్తుందుకు నిర్వాహకులకు మంత్రి అభినందనలు తెలిపారు.
ప్రతిరోజు 15 నిమిషాల నడక తప్పనిసరి: శ్రీనివాస్ గౌడ్ - 10k run conduected in hyderabad nakles road
హైదరాబాద్‌లో ఫ్రీడమ్ ఆయిల్స్ నిర్వహించిన 10కే రన్‌కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. పెరుగుతున్న కాలుష్యానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజు 15 నిమిషాల నడక తప్పనిసరి అని మంత్రి పేర్కొన్నారు.
ఆహారపు అలవాట్లలో భాగంగా పరుగు కావాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఫ్రీడమ్ హెల్తీ కూకింగ్ ఆయిల్స్ హైదరాబాద్ 10కె రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో... నెక్లెస్ రోడ్లో నిర్వహించిన 10కె, 5కె పరుగును మంత్రితో పాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సినీ తారలు అవికా గోర్, సంజన జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశ వ్యాప్తంగా 12వేల మంది యువతీ యువకులు పరుగులో పాల్గొన్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం... అనేక రోగాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. దీనికి పరిష్కారం ప్రతి రోజు తప్పనిసరిగా 15 నిమిషాలు నడక తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని... ఎన్ని కోట్లు సంబంధించిన ఆరోగ్యంగా లేకపోతే లాభం లేదన్నారు. అందుకే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో శరవేగంతో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు 17 ఏళ్లుగా హైదరాబాద్ 10కె పరుగు నిర్వహిస్తుందుకు నిర్వాహకులకు మంత్రి అభినందనలు తెలిపారు.
TAGGED:
10k run in hyderabad