ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 61,331 నమూనాలను పరీక్షించగా 10,526 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజులో 8,463 మంది కరోనా నుంచి కోలుకోగా.. 81 మంది మృతిచెందారు.
చిత్తూరు జిల్లాలో 10 మంది, కడప 9, నెల్లూరు 8, ప్రకాశం 8, పశ్చిమగోదావరి 8, తూర్పుగోదావరి 6, కర్నూలు 6, విశాఖపట్నం 6, అనంతపురం 5, కృష్ణా 5, శ్రీకాకుళం 5, గుంటూరు 4, విజయనగరంలో జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో మృతిచెందిన వారి సంఖ్య 3,714కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 35,41,321 నమూనాలను పరీక్షించారు. తాజా కేసులతో ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 4,03,616కి చేరింది.
ఇవీ చూడండి: ఎస్పీ బాలు హెల్త్ బులెటిన్ విడుదల