ETV Bharat / city

తెలంగాణ సంక్షేమ శాఖలో 10వేల ఉద్యోగ ఖాళీలు!

రాష్ట్రంలోని సంక్షేమ శాఖల్లో 10వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న సర్కార్ నిర్ణయం మేరకు వివిధ విభాగాల్లో ఖాళీలను గుర్తించి వివరాలు సిద్ధం చేశారు.

telangana, job vacancies
తెలంగాణలో ఉద్యోగాలు, ఉద్యోగ ఖాళీ భర్తీ
author img

By

Published : Mar 28, 2021, 8:17 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వివిధ శాఖలు ఖాళీల వివరాలను సిద్ధం చేశాయి. త్వరలో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న సర్కారు నిర్ణయం మేరకు విభాగాల్లో ఖాళీలను గుర్తించాయి. ప్రత్యక్ష నియామక ఖాళీలు, పొరుగుసేవల ఉద్యోగులు తదితర వివరాలతో నివేదికలు రూపొందించాయి. త్వ‌ర‌లో ఖాళీల వివరాలు అందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆయా విభాగాల ముఖ్యకార్యదర్శులకు లేఖలు రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం సీఎం త్వరలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని, ఖాళీల వివరాలు తెలియజేయాలని అందులో సూచించారు.

ఈ క్రమంలో ప్రభుత్వ విభాగాలు రూపొందించిన నివేదికల ప్రకారం సంక్షేమశాఖల్లో ఉద్యోగ ఖాళీలు 10వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇందులో గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులు 7వేలకు మించి ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిజానికి గత డిసెంబరులోనే ఈ ఖాళీల వివరాలు శాఖల వారీగా ప్రభుత్వానికి చేరాయి. పదోన్నతులతో, మూడు నెలలుగా పదవీ విరమణ పొందినవారితో ఏర్పడిన ఖాళీలతో జాబితాలు సిద్ధం చేశాయి. సొసైటీలు, ప్రధాన విభాగాధిపతి కార్యాలయాలు, కార్పొరేషన్ల వారీగా ఖాళీల వివరాలున్నాయి. వైద్య, పంచాయతీ రాజ్, గురుకుల సొసైటీలు, పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆయా శాఖల పరిధిలో ప్రత్యేక నియామక సంస్థ‌లు ఉన్నాయి. అక్కడి ఖాళీల భర్తీని అవి చేపట్టనున్నాయి. మిగతా శాఖల్లో ప్రక్రియ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.