ETV Bharat / city

గుట్కా ప్యాకెట్ల స్వాధీనం... వ్యక్తి అరెస్ట్ - Medchul_Malkajigiri district neredmet policestation

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎస్​ఓటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. జిల్లాలోని నేరేడ్​మెట్​ పీఎస్​ పరిధిలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు.

GUTKA PACKETS SEIZED
GUTKA PACKETS SEIZED
author img

By

Published : Jan 31, 2020, 10:50 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా నేరేడ్​మెట్​ పీఎస్ పరిధిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచిన గోడౌన్​పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి... భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. వీటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వినాయకనగర్​కు చెందిన నిరంజన్ అనే వ్యక్తి కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిపిస్తున్నాడని పేర్కొన్నారు.

అక్రమ సంపాదనకు అలవాటు పడిన అతను కిరాణ దుకాణం ముసుగులో ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నాడని చెప్పారు. ఇదివరకే ఎన్నోసార్లు ఇటువంటి కేసులో ఎస్​ఓటీ పోలీసులకు చిక్కినా బుద్ధి మారలేదని పోలీసులు అన్నారు.

రూ. 10 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.