ETV Bharat / city

రూసా ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ

author img

By

Published : Feb 4, 2019, 3:09 AM IST

ఉన్నత విద్య కోసం విదేశీయులే మన దేశానికి రావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీనగర్​లో అన్నారు. శ్రీనగర్​లోని షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నుంచి రూ.3 వేల కోట్ల రుసా నిధులతో దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టులను రిమోట్ కంట్రోల్ ద్వారా మోదీ ప్రారంభించారు. రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీలో రూ.వంద కోట్ల  ప్రాజెక్టుకు, వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయంలో రూ.50 కోట్లతో నిర్మించే పనులను  ఆన్​లైన్ ద్వారా ప్రధాని  ప్రారంభించారు.

రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్ష అభియాన్

రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్ష అభియాన్
ఓయూకి రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్ష అభియాన్​(రూసా)లో భాగంగా వంద కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. విశ్వవిద్యాలయాల్లో నాణ్యత పెంచేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ నిధులతో ఓయూలో టెక్నాలజీ బిజినెస్ సెంటర్, బయోడైవర్సిటీ, కన్జర్వేషన్ సెంటర్, మైక్రోబియల్ ఫర్మెంటేషన్ టెక్నాలజీ, పారిశ్రామిక ఉత్పత్తుల పరీక్ష కేంద్రం, సైబర్ భద్రత కేంద్రం, అంబేడ్కర్ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ రామచంద్రం, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
undefined
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి రూసా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 50 కోట్ల నిధులను మంజూరు చేసారని విశ్వవిద్యాలయం ఉపకులపతి సాయన్న తెలిపారు. రాష్టంలో 26 విశ్వవిద్యాలయాలు ఉండగా కేయూకు నిధులు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చిన నిధులతో విద్యార్థులకు ఉపకార వేతనాలు, 4 రీసెర్చ్ సెంటర్ల నిర్మాణానికి ఉపయోగిస్తామని పేర్కొన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.