ETV Bharat / city

'పంచాయతీరాజ్​ కార్యాలయం ముందు ధర్నా' - undefined

పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో అర్హత ఆధారంగా తమను నియమించాలని స్వల్ప తేడాతో ఉద్యోగవకాశం కోల్పోయిన అభ్యర్థులు డిమాండ్​ చేశారు. హిమాయత్​నగర్​లోని పంచాయతీరాజ్​ కమిషనర్​ కార్యాలయం ఎదుట రెండో రోజు కూడా నిరసన చేపట్టారు.

పంచాయతీరాజ్​ కమిషనర్​ కార్యాలయం ఎదుట రెండో రోజు కూడా నిరసన
author img

By

Published : Apr 16, 2019, 5:19 PM IST

Updated : Apr 16, 2019, 7:07 PM IST

పంచాయతీరాజ్​ కమిషనర్​ కార్యాలయం ఎదుట రెండో రోజు నిరసన

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ప్రవేశ పరీక్ష రాసి, ఎంపిక కాలేకపోయిన వారిని.. ఖాళీగా ఉన్న స్థానాల్లో అర్హత ఆధారంగా తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట రెండోరోజు కూడా ఆందోళన కొనసాగించారు. 2018 డిసెంబర్ 10న జరిగిన ఇంటర్వూలకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచినా.. ప్రతి జిల్లాలో 20 నుంచి 30 మంది కూడా హాజరు కాలేదని తెలిపారు. ఎంపికైన వారిలో కొంత మంది వేరే ఉద్యోగాలు సాధించారని.. ఆ ఖాళీలను కొద్ది తేడాతో అవకాశం కోల్పోయిన తమకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: 'భద్రత విషయంలో చింతించాల్సిన పనిలేదు'

sample description
Last Updated : Apr 16, 2019, 7:07 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.