న్యాయవాదుల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయింపు, బీమా, వైద్యం, ఇళ్ల స్థలాలు, యువ న్యాయవాదులకు రూ.10 వేల ఉపకార వేతనం, లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ సవరణ వంటి ఇతర సమస్యలుపరిష్కారించాలని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.
అఖిల భారత బార్ కౌన్సిల్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించామని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు.
అంతకు ముందు రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.