దిల్లీ గద్దెను శాసిద్దాం
ఎన్నికలంటే ఎండాకాలంలోనూ కాంగ్రెస్కు చలిజ్వరం వస్తుందని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నేతల చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే దిల్లీ గులాములు అవుతారు... మనం గెలిచి నవాబులు కావాలన్నారు. 16 ఎంపీలు గెలిచి దిల్లీని శాసిద్దామని పిలుపునిచ్చారు.
బడితె ఉన్నోడిదే బర్రె
కేసీఆర్ పథకాలే దేశానికి ఆదర్శమయ్యాయని కేటీఆర్ అన్నారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబే అన్నదాత సుఖీభవ పథకం తీసుకొచ్చారన్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి రాష్ట్రాలకే నిధులు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఆర్థిక సంఘం మిషన్ భగీరథకు 45వేల కోట్లు ఇవ్వమని సిఫార్సు చేస్తే 45పైసలు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్, భాజపా కూటమిగా ఏర్పడ్డా... కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు.
తమతో కలిసి వచ్చే పార్టీలు చాలా ఉన్నాయి.. అధికారంలో ఎవరుండాలో శాసించే స్థాయిలో ఉంటే మన ప్రాజెక్టులకు నిధులు వస్తాయన్నారు కేటీఆర్.
ఇవీ చూడండి:ముగిసిన మండలి ఎన్నికలు