ఇవీ చదవండి:నేతల అభినందనలు
ముందే ఎందుకు? - discussion
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందడంలో కేసీఆర్ విఫలమయ్యారని సీఎల్పీ నేత భట్టి విమర్శించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆరు నెలల కాలానికి పెట్టడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆరు నెలల కాలానికి పెట్టడంలో ఆంతర్యం ఏంటని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఎన్నికల ముందు మాత్రమే రెండు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ అన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అలా చేయలేదని ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగాలు బాగా కల్పించి ఉంటే... ఇప్పుడు నిరుద్యోగ భృతి ప్రకటించాల్సిన అవసరం వచ్చేది కాదని పేర్కొన్నారు. విభజన చట్టంలోని చాలా అంశాలను సాధించడంలో సీఎం కేసీఆర్ చొరవ చూపలేదని విమర్శించారు.
ఇవీ చదవండి:నేతల అభినందనలు
sample description