ETV Bharat / city

ఓయూకి వందేళ్లు - OSMANIA UNIVERSITY

భవిష్యత్తుకు పునాది చరిత్రే. గతంపై స్పష్టత ఉన్నప్పుడే.. భవిష్యత్తు నిర్మాణం పటిష్టంగా ఉంటుంది. చరిత్రను అర్థం చేసుకోవడానికి.. అధ్యయనం చేయడానికి.. ఉస్మానియా విశ్వవిద్యాలయం... ఎంతో మందికి తోడ్పాటునందించింది. ఘన చరిత సొంతం చేసుకున్న ఓయూ చరిత్ర విభాగం వందేళ్లు పూర్తి చేసుకుంది. ఏడాది పాటు శతాబ్ది సంబురాలు జరిపేందుకు ముస్తాబయింది. నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మక దక్షిణ భారత చరిత్ర సదస్సు జరగనుంది.

ఓయూ చరిత్ర విభాగానికి వందేళ్లు పూర్తి
author img

By

Published : Feb 8, 2019, 6:30 AM IST

Updated : Feb 8, 2019, 9:55 AM IST

ఓయూ చరిత్ర విభాగానికి వందేళ్లు పూర్తి
ఉస్మానియా యూనివర్సిటీ మరో శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబయింది. ఓయూలోని చరిత్ర విభాగం నేటితో వందేళ్లు పూర్తి చేసుకుంది. 1918లో విశ్వ విద్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి చరిత్ర ఉంది. చరిత్ర ఒక సబ్జెక్టుగా ఉర్దూలో బోధించే వారు. ఆనాటి విద్యార్థుల్లో చరిత్రపై ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని.. 1919లో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. 26 మంది విద్యార్థులు, ఆరుగురు అధ్యాపకులతో డిగ్రీ కోర్సు ప్రారంభమైంది. నాడు చరిత్ర కోర్సుకున్న డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని.. 1924లో 32 మంది విద్యార్థులు.. 11 మంది అధ్యాపకులతో పీజీ కోర్సులను మొదలుపెట్టారు. ఆ తర్వాత 1960 నుంచి పరిశోధనలు మొదలు పెట్టి... పీహెచ్​డీ, ఎంఫిల్ కోర్సులకు తెరలేపారు. ఇప్పటి వరకు ఈ విభాగంలో 114 మంది పీహెచ్​డీ, 75 మంది ఎంఫిల్ చేశారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఓయూ.. ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ భారత హిస్టరీ కాంగ్రెస్ జరగనుంది. ఓయూలో 1940లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, 1979లో దక్షిణ భారత చరిత్ర సదస్సు జరిగాయి. ఆ తర్వాత 1986 జనవరి 9న దక్షిణ భారత చరిత్ర సదస్సు జరిగింది. మళ్లీ 33 ఏళ్ల తర్వాత దక్షిణ భారత హిస్టరీ కాంగ్రెస్​కు ఓయూ వేదికగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది పూర్వ విద్యార్థులు హాజరు కానున్నారు. ఈనెల 10 దాకా సదస్సు జరగనుంది.
undefined
ఓయూ చరిత్ర విభాగం శతాబ్ది సందర్భంగా సంవత్సరం పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. చరిత్రకారులతో సదస్సులు, చర్చాగోష్టులు, సమావేశాలు జరపనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న చరిత్ర పరిశోధకులతో ప్రతిష్టాత్మకంగా హెరిటేజ్ వాక్​ను త్వరలోనే నిర్వహించనున్నారు.

sample description
Last Updated : Feb 8, 2019, 9:55 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.