ETV Bharat / city

బూర, కోమటిరెడ్డి మరో సెట్​ నామపత్రం దాఖలు

భువనగిరి పార్లమెంట్​ తెరాస అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​, కాంగ్రెస్​ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి కలెక్టరేట్​లో మరో సెట్​ నామినేషన్​ దాఖలు చేశారు. పట్టణంలో ఇరు పార్టీలు ర్యాలీ నిర్వహించటం వల్ల ట్రాఫిక్​కు ​ అంతరాయం కలిగి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మరో సెట్​ నామినేషన్​ దాఖలు
author img

By

Published : Mar 25, 2019, 7:55 PM IST

మరో సెట్​ నామినేషన్​ దాఖలు
భువనగిరి పార్లమెంట్ తెరాస, కాంగ్రెస్​ అభ్యర్థులు నేడు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. తమ కార్యకర్తలతో కలిసి వెళ్లి కలెక్టరేట్​లో నామపత్రాలు అందజేశారు.నామినేషన్​ అనంతరం ర్యాలీ నిర్వహించిన నర్సయ్య గౌడ్​..
ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయాలనుకున్న బూర నర్సయ్య గౌడ్.. సమయం సరిపోదని భావించి ముందుగానే కలెక్టరేట్​లో నామినేషన్ వేశారు. తదనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
భారీ ర్యాలీతో కోమటిరెడ్డి నామినేషన్​
బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారీ ర్యాలీగా నామినేషన్ వేయటానికి కలెక్టరేట్​కు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్యే రాజగోపాల్​రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్​ పొన్నాలతో పాటు, పార్టీ అభిమానులు భారీగా హాజరయ్యారు.
భారీ ర్యాలీలతో ట్రాఫిక్​కు అంతరాయం
ఇరు పార్టీల నేతలు భారీ ర్యాలీలు నిర్వహించడం వల్ల భువనగిరి పట్టణంలో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. గూడూరు టోల్​ప్లాజా నుంచి కోమటిరెడ్డి సోదరులు భారీ ర్యాలీతో నామినేషన్​ వేయడానికి రావటంతో అక్కడ ట్రాఫిక్​ కొద్దిసేపు నిలిచిపోయింది.

ఇవీ చూడండి: చివరిరోజు కోలాహలం.. ముగిసిన నామినేషన్ల పర్వం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.