మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్లో చేరేందుకు గాను ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు జిల్లా కేంద్రంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్ దృష్ట్యా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీన్ చేశాకే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.
పరీక్ష కేంద్రాలను గురుకులాల ప్రాంతీయ సమన్వయ కర్త యాదగిరి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు సామాజిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జిల్లాలో 900 మంది పరీక్ష రాయాల్సి ఉండగా... 85 శాతానికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగింది.
ఈసారి వంద శాతం పదో తరగతి ఫలితాలు నమోదు కావడంతో ప్రభుత్వ గురుకులాల ప్రవేశ పరీక్షకు తీవ్రమైన పోటీ ఏర్పడింది.