ETV Bharat / city

Adilabad News: చెట్టు కోసం ఇంటి డిజైనే మార్చేశారు! - tree in the house

Telangana News 2021 : ఇంటి ముందున్న చెట్టు.. దేనికైనా అడ్డొస్తుందటే నిర్దాక్షిణ్యంగా దాన్ని నరికేస్తారు కొందరు. ఏళ్ల తరబడి అది అందించిన నీడను.. దానితో ఉన్న అనుబంధాన్ని కూడా మరిచిపోతారు. కానీ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్​ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి అడ్డొచ్చిన చెట్టును అలా తొలగించలేదు. అలా అని ఇంటి నిర్మాణాన్ని ఆపలేదు. చెట్టును నరకుండా.. ఇంటి నిర్మాణాన్ని ఆపకుండా ఓ ఉపాయం ఆలోచించాడు. అదేంటంటే..

Adilabad News 2021
Adilabad News 2021
author img

By

Published : Nov 30, 2021, 11:28 AM IST

.

Tree in the House : ఇళ్ల నిర్మాణాలు, ఇతర అవసరాలకు పెద్దపెద్ద వృక్షాలనే నరికేస్తున్న రోజులివి. కానీ ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల కేంద్రానికి చెందిన ఆర్యన్‌ మహారాజ్‌ అనే వ్యక్తి మాత్రం చెట్టును కొట్టేయడం ఇష్టం లేక తన ఇంటి డిజైన్‌నే మార్చేసుకున్నారు. ఆర్యన్‌ మహారాజ్‌ కొన్ని నెలల క్రితం ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఆ స్థలంలోని ఓ ఇప్ప చెట్టు సరిగ్గా ఇంటి మధ్యలోకి వస్తుండటంతో.. ఇంటి ఆకృతిని మార్పు చేయించుకున్నారు. చెట్టును అలాగే ఉంచి మిద్దెపైకి వెళ్లేందుకు వీలుగా ఓ చిన్నగదిని నిర్మించుకున్నారు. కాంక్రీటు, సిమెంటు వల్ల చెట్టు ఎదగదన్న ఉద్దేశంతో వెదురుబొంగులు, చెక్కలు, పెంకులతో గది పైకప్పును ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.