మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు సాంకేతిక టెక్నాలజీకి అలవాటుపడుతున్నారు. చిన్న గుండు పిన్ను దగ్గర నుంచి ప్రతీది ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొన్ని కంపెనీలు ఇటీవల కాలంలో అప్పుడప్పుడు ఒకదానికి బదులుగా మరొకటి పంపుతున్నాయి. ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేస్తే రాళ్లు, సబ్బులు, ఇతర వస్తువులు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని బోయవాడలో నివాసం ఉంటున్న పందిరి భీమన్న ఐదు రోజుల కిందట తనకు ఇష్టమైన చరవాణిని ఈ-కామర్స్ సైట్‌లో ఆర్డర్ చేశారు... పార్శిల్ రాగానే ఎంతో ఆనందంగా తెరిచారు. ప్యాక్ తెరిచిచూడగానే అవాక్కయ్యారు. అందులో ఫోన్‌కు బదులుగా రిన్‌సబ్బు వచ్చింది. ఇటీవల ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ముందుగా జాగ్రత్తగా వీడియో తీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. మోసపోయిన తనను ఆదుకోవాలని.. కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి:గూగుల్ పేలో చెల్లింపు.. వాట్సాప్‌లో బోగస్ ప్రతులు..!