ETV Bharat / city

Red Cross Society Land Issue : కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న భూమి కబ్జా - Red Cross Society Land Kabza

Red Cross Society Land Issue: ఆదిలాబాద్‌ జిల్లాలో భూ అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉండే రెడ్‌క్రాస్‌ సొసైటీ స్థలాన్నే కబ్జా చేయడం కలకలం రేపుతోంది. అక్రమాల తతంగం వెనక ఆదిలాబాద్‌ పురపాలక సంఘంలోని ఓ ద్వితీయ స్థాయి నేత హస్తం ఉండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Red Cross Society Land Issue :
Red Cross Society Land Issue :
author img

By

Published : Mar 17, 2022, 10:57 AM IST

రెడ్‌క్రాస్ సొసైటీ భూమిపై కబ్జాదారుల కన్ను

Red Cross Society Land Issue : ఆదిలాబాద్‌ నడిబొడ్డున ఉండే పాతహౌసింగ్‌ బోర్డు కాలనీలో 2015లో అప్పటి కలెక్టర్‌ జగన్మోహన్‌.. రెడ్‌క్రాస్‌ సొసైటీకి నాలుగు గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించారు. అధికారికంగా ప్రొసీడింగ్‌తో కూడిన పత్రాలు జారీచేశారు. అదే ఏడాది సోసైటీ భవన నిర్మాణానికి భూమి పూజచేశారు. నిధులలేమి వల్ల భవన నిర్మాణం జరగలేదు. రెడ్‌క్రాస్‌ సోసైటీ ఏడాదికోసారి నిర్వహించే కార్యక్రమాలకు ఆ స్థలం వేదికగా నిలుస్తోంది. మిగతా సమయాల్లో ఖాళీగా ఉంటోంది.

Red Cross Society Land Issue in Adilabad : ఇదే అదనుగా భావించిన పురపాలక సంఘంలోని ఓ ద్వితీయ స్థాయినేత మున్సిపాలిటీ ద్వారా ఆ స్థలానికి ఇంటి నెంబర్‌ ఇప్పించి ఇంటిపన్ను చెల్లిస్తున్నట్లు రసీదులు సృష్టించాడు. వాటి ఆధారంగా రెండు నెలల క్రితం రెడ్‌క్రాస్‌ సొసైటీ భూమిని బం‍ధువుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. తాజాగా ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించడంతో విషయం బయటపడింది. అక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు గంగేశ్వర్‌ తెలిపారు.

Red Cross Society Land Kabza in Adilabad : "2015లో అప్పటి ఆదిలాబాద్ కలెక్టర్ జగన్మోహన్.. రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత భవనం నిర్మణానికి నాలుగు గుంటల స్థలం ఇచ్చారు. రెవెన్యూ భూముల్లో నుంచి ఈ స్థలాన్ని మా సొసైటీ కోసం కేటాయించారు. అప్పట్నుంచి ఈ భూమిలో మా సొసైటీ తరఫున కార్యక్రమాలు చేస్తున్నాం. భవన నిర్మాణానికి నిధులు సమకూరకపోవడం వల్ల ఈ స్థలంలో ఇంకా నిర్మాణం చేపట్టలేదు. వసీం కోకర్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు చూపించి ఈ భూమి తనదని అన్నారు. ఈ స్థలాన్ని వదిలి వెళ్లకపోతే సొసైటీ భూములు లాక్కుంటామని బెదిరించారు."

- గంగేశ్వర్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు

"నెల క్రితం.. ఈ భూమిలో ఓ గుడిసె ఉన్నట్లు.. దాన్ని కూల్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇది భూ మాఫియా కేసు అని కచ్చితంగా తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ స్వయంగా కేటాయించిన భూమే కబ్జాకు గురవుతోందంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు."

- గోవర్ధన్ రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడు

Red Cross Society Land Grabbed in Adilabad : అన్యాక్రాంతమైన రెడ్‌క్రాస్‌ సొసైటీ స్థలాన్ని సందర్శించిన భాజపా నేతలు.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, సామాన్యుల గోడు పట్టించుకోని అధికారులు.. అక్రమాలకు పాల్పడేవారికి వంతపాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారుల కర్తవ్యమేంటి..?

"అధికార పార్టీ నాయకుల అండ చూసుకునో.. అధికారుల సాయంతోనో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయి. పేదలకు ఇంటి నంబర్ ఇవ్వమంటే ఏళ్ల తరబడి తిప్పుకుంటారు కానీ.. ఈ కబ్జాదారులకు మాత్రం ఫేక్ నంబర్లు వెంటనే ఇచ్చేస్తారు. అధికార పార్టీ ఏం చెబితే అది చేయడమే అధికారుల పనా లేక ప్రజలకు సేవలందించడమా?"

- సుహాసిని రెడ్డి, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు

Red Cross Society Land Kabza :ఆలస్యంగా అప్రమత్తమైన అధికారుల బృందం సంఘటనాస్థలాన్ని పరిశీలించింది. సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందించే ప్రయత్నంచేస్తోంది. తన పాత్ర బయటపడకుండా పురపాలక సంఘం ద్వితీయ స్థాయి నేత అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.