ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్యామ్ఘడ్కోటను మంత్రి సందర్శించారు. కోటలో ఏర్పాటు చేయనున్న ఎల్ఈడీ లైటింగ్ పనులను మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీకి ఈ పనులకు అప్పగించామని, మూడు వారాల్లో పనులు పూర్తి చేస్తారని తెలిపారు.
![minister indrakaran reddy inaugurated shamgarh fort lighting works in nirmal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9044858_80_9044858_1601800524342.png)
నిమ్మరాజుల పరిపాలనలో నిర్మించిన కోటలు బత్తిస్ ఘడ్, శ్యామ్ ఘడ్, కిల్లగుట్ట, సోన్ వంటి పురాతన వంతెనలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం నిర్మల్ శివారులోని కొండాపూర్ తెరాస కార్యాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఎఫ్ఏసీఎస్ ఛైర్మన్ ధర్మజీగారి రాజేందర్ పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అపోహలు వద్దు.. ఆస్తుల నమోదు మాత్రమే: మేయర్