ETV Bharat / city

జోరు వానలు: ఉప్పొంగుతున్న వాగులు.. రాకపోకలకు అవస్థలు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. మత్తడివాగు, సాత్నాలా, స్వర్ణ, కడెం, గడ్డెన్నవాగు, ఎల్లంపల్లి, వేమనపల్లి, నీల్వాయి, వట్టివాగు, ఆడ ప్రాజెక్టుల్లోకి వదర నీరు చేరుతోంది. సింగరేణిలోని శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి, గోలేటి, మందమర్రి ప్రాంతాల్లోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

heavy rains in united adilabad district many bridges lapsed due to floods
జోరు వానలు: ఉప్పొంగుతున్న వాగులు.. రాకపోకలకు అవస్థలు
author img

By

Published : Aug 16, 2020, 6:15 PM IST

జోరు వానలు: ఉప్పొంగుతున్న వాగులు.. రాకపోకలకు అవస్థలు

ఆదిలాబాద్​ జిల్లాలో..

ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైన ఏర్పడిన గుంతల్లో వరద నీరు చేరి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. జోరువానల నేపథ్యంలో కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగితే 18004251939 టోల్ ఫ్రీ నంబర్​ను సంప్రదించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. జిల్లాలోని వర్షాల పరిస్థితిపై తహసీల్దార్, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ ద్వారా సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

మంచిర్యాల జిల్లాలో..

మంచిర్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం 14.3 మీమీ వర్షం కురవాల్సి ఉండగా 31.3 మీమీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తుంతుంగ వాడు పొంగిపొర్లుతోంది. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని 11 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. చెన్నూరు మండలంలోని సుద్దాలవాగు పొంగిపొర్లుతుండడం వల్ల 5 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మందమర్రి పట్టణంలోని యాపల్‌ ప్రాంతంలో మిట్టపల్లి బాబు అనే వ్యక్తి ఇంటి గోడ రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టు పూర్తిగా నిండి మత్తడి పోస్తోంది. ముల్కలపేట, కేతనపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. వేమనపల్లి , నాగరం మధ్య వాగు ఉప్పొంగుతుండడం వల్ల బెల్లంపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. గొర్లపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

కన్నెపల్లి మండలంలో వీరాపూర్, ఎర్రవాగు ప్రాజెక్టులు నిండాయి. లింగాల గ్రామంలో ఆల్కారి జయ అనే రైతు ఇల్లు వర్షానికి కూలిపోయింది. భీమిని మండలంలో తంగళ్లపల్లి, వెంకటాపూర్ గ్రామాల మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. 148 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టానికి 145.98 మీటర్ల ఎత్తుకు వరద నీరు చేరింది. ప్రస్తుతం జలాశయంలో 14.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 8,541 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి చేరుతోంది. 5,521 క్యూసెక్కుల నీటిని నంది పంప్ హౌజ్​, హైదరాబాద్ వాటర్ బోర్డ్, రామగుండం ఎన్టీపీసీకి తరలిస్తున్నారు. సుందిళ్ల పార్వతి జలాశయం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి 5,765 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు.

జైపూర్ మండలంలో పెగడపల్లి వాగు ఉప్పొంగుతోంది. దీంతో 12 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిట్టపల్లి వాగు ఉప్పొంగింది. కోటపల్లి మండలం అర్జున బుట్టలో ప్రాణహిత నది నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుండడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది.

ఆసిఫాబాద్​ జిల్లాలో..

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. జిల్లాలోని కాగజ్​నగర్, సిర్పూర్​. కౌటాల, బెజ్జురు, పెంచికలపేట, చింతలమానేపల్లి, దహేగం మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

కాగజ్​నగర్ మండలంలోని చింతగుడా కోయవాగు గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోయవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన రహదారి కొట్టుకుపోయింది. డీఎస్పీ స్వామి ఆ గ్రామాన్ని సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు.

చింతలమానేపల్లి మండలంలోని దిందా వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దిందా గ్రామం జలదిగ్బంధంలో ఉండిపోయింది. బెజ్జురు మండలంలోని పెంచికల పేట, కౌటాల, కాగజ్​నగర్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కుమురంభీం జలాశయం ప్రధాన ఎడమ కాలువ లైనింగ్​లు పగిలిపోయాయి. చిన్న వాంకిడి గ్రామం పక్కన ఏర్పాటు చేసిన ప్రధాన ఎడమ కాలువకు పెద్ద గండి పడింది. ఫలితంగా నీరు వృథాగా పోతోంది. వాంకిడి మండలంలోని చిన్న వాంకిడి సమీపంలో భీమ్ జలాశయం ప్రధాన ఎడమ కాలువకు గతేడాది ఆగస్టులో గండిపడింది. అక్టోబరులో మరమ్మతులు చేపట్టారు. మట్టి నింపి, లైనింగ్​లను ఏర్పాటు చేశారు. సరిగ్గా ఏడాది గడవక ముందే మరమ్మతులు చేపట్టిన చోటే తిరిగి గండిపడింది.

నిర్మల్​ జిల్లాలో..

మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న జల్లులకు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో స్వర్ణ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,183 అడుగులు కాగా ప్రస్తుతం 1182.5 అడుగులకు నీరు చేరుకుంది. అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 2879 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు.

ఇవీచూడండి: ఉగ్ర గోదావరి : మూడో ప్రమాద హెచ్చరిక జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.