నిర్మల్ జిల్లా లోకేశ్వరం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి రెండుగంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో పది సంవత్సరాల నుంచి భద్రపరిచిన కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు కాలిపోయాయి.
సమాచారం అందుకుని..
తహసీల్దార్ కార్యాలయం పై గదిలో నుంచి మంటలు రావటంతో.. అక్కడ రాత్రి విధులలో ఉన్న సిబ్బంది పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మార్వో వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఏం జరగనట్టుగా...
అక్కడ సగం కాలిన పత్రాలను ట్రాక్టర్లో ఊరి చివరి చెరువు వద్దకు తరలించి పూర్తిగా తగులబెట్టారు. రాత్రి సంఘటన జరగటంతో.. ఉదయం వరకు రెవెన్యూ సిబ్బందితో ఏమి జరగనట్టుగా శుభ్రం చేపించారు.
'షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గత పది సంవత్సరాల నాటి కుల, ఆదాయ, నివాస తదితర ధ్రువపత్రాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో రికార్డు రూమ్‌కు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం'.
-వెంకటరమణ, తహసీల్దార్
ఇదీ చదవండి:కరోనా కొత్త స్ట్రెయిన్‌పై మంత్రి ఈటల సమీక్ష