ఓ వైపు కరోనా, మరోవైపు లాక్డౌన్ దెబ్బతో కుదేలైన రైతుకు అకాల వర్షం సైతం నష్టం మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అరగంటసేపు కురిసిన అకాల వర్షం ఆగం చేసింది. నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దెబ్బకు చేతికొచ్చిన పంట వర్షార్పణం అయింది. గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సైతం వరి, మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. బలమైన గాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి.
ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు