కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని ఎక్కడి వారిని అక్కడే నిలువరిస్తున్నారు. జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో నలుగురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
ఉదయం పూట నిత్యావసరాల వస్తువుల కోసం మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. మిగతా సమయంలో ప్రజలను పోలీసులు రోడ్డు మీదకు అనుమతించడం లేదు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల జిల్లాకేంద్రంలోని ప్రధాన రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి.
ఇదీ చూడండి : కరోనాపై ప్రజానాట్యమండలి కళాకారుల పాట