వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పౌరసరఫరాలు మొదలైన అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఒక్కరికి పని కల్పించాలని జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: ఆ బామ్మ సంగీతానికి ఎవరి మనసైనా కరగాల్సిందే!