ETV Bharat / business

'మా ప్రతినిధులను బెదిరించారు'.. ఈడీపై షియోమీ ఆరోపణలు - ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్

Xiaomi Allegations: ఈడీ అధికారులు తన ప్రతినిధులపై భౌతిక దాడికి దిగారని షియోమీ సంస్థ ఆరోపించింది. తాము చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అధికారులు బెదిరించినట్లు పేర్కొంది. అయితే షియోమీ ఆరోపణల్ని ఈడీ కొట్టిపారేసింది. ఇవన్నీ షియోమీ సృష్టించిన కథనాలని విమర్శించింది.

xiaomi allegations
షియోమీ ఆరోపణలు
author img

By

Published : May 7, 2022, 7:14 PM IST

Xiaomi Allegations: చైనా మొబైల్‌ తయారీ కంపెనీ షియోమీ ఇండియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులపై సంచలన ఆరోపణలు చేసింది. భారత విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలపై దర్యాప్తు సమయంలో తమ ప్రతినిధులపై ఈడీ అధికారులు 'భౌతిక దాడి'కి దిగారని కోర్టుకు నివేదించింది. ఇటీవల షియోమీకి చెందిన రూ.5,551 కోట్లను ఈడీ జప్తు విధించింది. అయితే, ఈ జప్తును గురువారం ఓ కోర్టు ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.

ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (షియోమీ ఇండియాగానూ పిలుస్తారు), ఎమ్‌ఐ బ్రాండ్‌ మొబైల్‌ ఫోన్లకు భారత్‌లో ట్రేడర్‌, పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. ‘చైనాకు చెందిన షియోమీ గ్రూప్‌ అనుబంధ సంస్థ షియోమీ ఇండియా బ్యాంకు ఖాతాల్లోని రూ.5,551.27 కోట్లను జప్తు చేసిన’ట్లు ఏప్రిల్‌ 30న ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై షియోమీ కోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి ప్రస్తుతానికి జప్తును నిలిపివేశారు.

ఈ విషయంలో ఫిబ్రవరి నుంచి ఈడీ దర్యాప్తు జరుపుతోంది. అందులో భాగంగా పలువురు షియోమీ ఇండియా ప్రతినిధుల్ని ఈడీ ప్రశ్నించింది. విచారణ సమయంలో తమ మాజీ ఎండీ మను కుమార్‌ జైన్‌, ప్రస్తుత సీఎఫ్‌ఓ సమీర్‌ బి.ఎస్‌.రావును ఈడీ అధికారులు బెదిరించారని షియోమీ తాజాగా ఆరోపించింది. తాము చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు చెప్పుకొచ్చింది. అరెస్టులు, భౌతిక దాడులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించినట్లు ఆరోపించింది. ఈ ఒత్తిడిని కొంతకాలం తమ ప్రతినిధులు భరించారని తెలిపింది. కానీ, చివరకు తలొగ్గి కొన్ని విషయాల్లో వారికి అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొంది.

అవన్నీ సృష్టించిన కథనాలు: షియోమీ ఆరోపణల్ని ఈడీ కొట్టిపారేసింది. కంపెనీ అధికారులపై ఒత్తిడి తెచ్చామన్నది ఆధారరహితమని వివరించింది. ఇవన్నీ షియోమీ సృష్టించిన కథనాలని విమర్శించింది. ఈడీ విలువలను పాటించే సంస్థని తెలిపింది. వారి ఆధారాలన్నీ అనుకూల వాతావరణంలో సేకరించామని పేర్కొంది. సంస్థ ప్రతినిధులు కొన్నింటిని రాతపూర్వకంగా.. మరికొన్నింటిని ఈడీ ముందు మౌఖికంగా స్వచ్ఛందంగా సమర్పించారని తెలిపింది.

ఇవీ ఆరోపణలు... షియోమీ ఇండియా భారత్‌లో 2014 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. ఆ మరుసటి ఏడాది నుంచే ఈ కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన ఈడీ, దర్యాప్తు చేపట్టింది.

సేవలు పొందకుండానే నగదు: 'ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా రూ.5551.27 కోట్లకు సమానమైన విదేశీ మారకపు ద్రవ్యాన్ని విదేశాల్లో పనిచేస్తున్న మూడు సంస్థలకు అక్రమంగా పంపించింది. షియోమీ గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. మాతృ సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలను పొందకుండానే ఈ నగదును పంపించింది. సంబంధం లేని పలు పత్రాలను గ్రూప్‌ కంపెనీల మధ్య సృష్టించి, వాటి మాటున ఈ నిధులను రాయల్టీ పేరిట విదేశాలకు తరలించింద'ని ఈడీ వెల్లడించింది. ఈ కేసు విచారణలో భాగంగానే షియోమీ ఇండియా గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మను కుమార్‌ జైన్‌ను ఈడీ ఇటీవల ప్రశ్నించింది. మరోవైపు 'మా రాయల్టీ చెల్లింపులు, బ్యాంకులకు ఇచ్చిన వివరాలు అన్నీ చట్టబద్ధమైనవి, నిజమైనవ'ని షియోమీ ఇండియా ప్రతినిధి తెలిపారు.

ఇదీ చూడండి: ఒకేచోట మదుపు ఎప్పుడూ ప్రమాదమే.. మీరేం చేయాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.