ETV Bharat / business

మీ సిబిల్​​ స్కోర్​ తగ్గుతోందా? కారణాలు ఇవే కావచ్చు! - Common CIBIL Score Mistakes

Common Credit Score Mistakes : క్రెడిట్​ స్కోర్​.. క్రెడిట్​ కార్డులు వాడే ప్రతి ఒక్కిరికీ సుపరిచతమైన పదం. దీని ఆధారంగానే మనకు బ్యాంకుల్లో రుణాలు లభిస్తాయి. కానీ, కొన్ని సందర్భాల్లో మనం సరైన సమయానికి లోన్స్​ చెల్లించినా మనకు తెలియకుండానే క్రెడిట్​ స్కోర్​ తగ్గుతూ వస్తుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనే కారణాలను ఎప్పుడైనా అన్వేషించారా..?

Why My Crdeit Card CIBIL Score Is Getting Decrease What Are The Reasons Behind It
Credit Score : మీ సిబిల్​​ స్కోర్​ ఎందుకు తగ్గుతుందో తెలుసా..? ఇవే కారణాలు!
author img

By

Published : May 21, 2023, 4:32 PM IST

Updated : May 21, 2023, 5:38 PM IST

Common CIBIL Score Mistakes : ఒక వ్యక్తి బ్యాంకుల్లో కానీ మరే ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో కానీ రుణాలు పొందాలంటే 'క్రెడిట్​ స్కోర్​' అత్యంత కీలకం. సాధారణంగా 750 పాయింట్లకు మించి క్రెడిట్​ స్కోర్​ ఉన్నప్పుడు అది మంచి స్కోరు అని అర్థం. ఇలాంటి వారికి బ్యాంకులు సులభంగానే రుణాలు ఇస్తాయి. స్కోరు బాగున్నప్పుడు వడ్డీ రేట్లలోనూ పలు రాయితీలను కస్టమర్లకు ఆఫర్​ చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే మన క్రెడిట్​ స్కోర్​లను తగ్గించేస్తాయి బ్యాంకులు. ఆయా బ్యాంకులు దీనిని ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా కొన్ని సార్లు మనం చేసే తప్పిదాలే మన క్రెడిట్​ స్కోర్​పై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో మనం భవిష్యత్తులో మరే ఇతర రుణాలు తీసుకోవాలని అనుకున్నా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా మనకు కావాల్సిన అవసరాలను సకాలంలో తీర్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటాము. ఇటీవలి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యే ఇది. మరి ఇంతటి కీలకమైన వ్యవహారంలో మీరు తీసుకునే కొన్ని జాగ్రత్తలతో ఈ సమస్యకు చెక్​ పెట్టి మీ 'క్రెడిట్​ స్కోర్'​ను పెంచుకొని ఈజీగా లోన్స్​ పొందొచ్చనే విషయం మీకు తెలుసా..? అదెలాగో ఇప్పుడు చూద్దాం.

  • Reasons For Low CIBIL Score : ముఖ్యంగా మీ క్రెడిట్‌ రిపోర్ట్​ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే మీ క్రెడిట్‌ స్టేట్​మెంట్​లో ఏమైనా పొరపాట్లను గుర్తిస్తే వెంటనే సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
  • మీరు మీ లోన్స్​ ఇన్​స్టాల్​మెంట్​లను సకాలంలోనే బ్యాంకులకు చెల్లిస్తున్నారు. కానీ, రుణదాత (లోన్స్​ ఇచ్చే సంస్థలు) ఆ విషయాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు వివరంగా నివేదించకపోవచ్చు. అలాగే ఆలస్యపు చెల్లింపులుగా పేర్కొనవచ్చు. అలాంటి సమయాల్లో మీ క్రెడిట్​ స్కోర్​ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటప్పుడే అప్రమత్తమై మీరు జరిపే చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేనప్పుడు ఆ విషయాన్ని రుణదాత దృష్టికి తీసుకెళ్లండి. వెంటనే నివేదికను సవరించమని కోరండి.
  • Reasons For Low Credit Score : మీ వ్యక్తిగత వివరాలుగా చెప్పే పేరు, పాన్‌ కార్డ్​ వివరాలు, ఇంటి చిరునామా సహా తదితర అంశాల్లో ఎలాంటి తప్పులు గానీ అక్షర దోషాలు వంటి పొరపాట్లను గమనిస్తే ఆలస్యం చేయకుండా బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా మార్పించేందుకు ప్రయత్నించండి. అయితే ఈ కారణంతోనే మీ స్కోర్​ తగ్గకపోయినా మీరు లోన్​ తీసుకునేటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తొచ్చు.
  • సాధారణంగా కొందరు తమ సౌకర్యం దృష్ట్యా తాము తీసుకునే హౌస్​ లోన్​, వెహికిల్​ లోన్​ వంటి రుణాలను ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు ట్రాన్స్​ఫర్​ చేసుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లో రెండు బ్యాంకుల్లో అప్పు ఉన్నట్లు రిపోర్ట్​లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సమయాల్లో మీ పాత రుణదాతను లేదా బ్యాంకును సంప్రదించి రుణం చెల్లించినట్లుగా క్రెడిట్‌ బ్యూరోలకు తెలియజేయాల్సిందిగా కోరడం ద్వారా సమస్య అక్కడిక్కక్కడే పరిష్కారమవుతుంది.
  • Why CIBIL Score Is Decreased : ముఖ్యంగా కొన్నిసార్లు మీ క్రెడిట్‌ రిపోర్ట్​లో మరో వ్యక్తి తీసుకున్న లోన్​ వివరాలు ఉండవచ్చు. పేర్లు, చిరునామా, పాన్‌ సంఖ్యలో తప్పులుండటం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. మీ క్రెడిట్‌ నివేదికలో ఇలాంటి తప్పులను మీరు గుర్తిస్తే గనుక వెంటనే సంబంధిత బ్యాంకులు, క్రెడిట్‌ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లి సమాచారం ఇవ్వండి.
  • Credit Score Mistake : బ్యాంకులు మనకిచ్చే క్రెడిట్‌ కార్డులపై రుణ పరిమితి (క్రెడిట్​ లిమిట్​)ని పెంచుతుంటాయి. కానీ సదరు బ్యాంకులు ఆ సమాచాం క్రెడిట్​ బ్యూరోలకు ఇవ్వకపోవచ్చు. బ్యాంకులు చేసే ఈ పొరపాటు మీకు తెలియకపోవచ్చు. అయితే మీరు మీ కార్డును బ్యాంకులు పెంచిన పరిమితి మేరకు వాడినా క్రెడిట్​ బ్యూరోల దగ్గర ఇందుకు సంబంధించిన సమాచారం లేకపోవడం వల్ల మీరు మీ క్రెడిట్​ లిమిట్​ను అధిగమించారన్న కారణంతో క్రెడిట్​ బ్యూరోలు మీ క్రెడిట్​ స్కోర్​ను తగ్గించే ప్రమాదం ఉంది. మీ క్రెడిట్‌ కార్డ్​ ఖాతా వివరాల్లో ఇలాంటి పొరపాట్లు కనిపిస్తే వెంటనే సదరు బ్యాంకులను సంప్రదించాలి. చెల్లింపులు సరిగ్గా నమోదయ్యాయా లేదా అనేదీ ఒకటికి రెండు సార్లు చూసుకుంటే మంచిది.
  • చివరగా మీ క్రెడిట్​ రిపోర్ట్​లో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించండి. చిన్న తప్పు ఉన్నా అస్సలు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే సంబంధిత బ్యాంకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, క్రెడిట్‌ బ్యూరోలకు సమాచారం అందించి వాటిని సరిచేసుకోండి. కనీసం మూడు నెలలకోసారైనా మీ క్రెడిట్‌ రిపోర్ట్​ను తెప్పించుకొని పరిశీలించడాన్ని ఓ అలవాటుగా మార్చుకొండి.
  • ఇవీ చదవండి:
  • రూ.2వేల నోట్ల మార్పిడికి కొత్త రూల్.. ఏంటంటే?
  • రూ.2వేల నోట్లు ఇప్పుడు చెల్లుతాయా? మార్చుకోవాలంటే ఛార్జీలు చెల్లించాలా?

Last Updated : May 21, 2023, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.