ETV Bharat / business

పీపీఎఫ్‌ పథకం కింద రుణం ఎప్పుడు తీసుకోవచ్చో తెలుసా? - పీపీఎఫ్‌పై రుణం వివరాలు

అధిక వడ్డీతో పాటు ప్రభుత్వ హామీతో కూడిన పన్ను రహిత రాబడినిచ్చే పథకాలలో పీపీఎఫ్‌ అన్ని పొదుపు పథకాల కంటే ముందు ఉంటుంది. అయితే ఈ పొదుపు పథకం కింద రుణం ఎప్పుడు తీసుకోవచ్చో తెలుసా?

PPF LOAN
పీపీఎఫ్‌పై రుణం
author img

By

Published : Dec 13, 2022, 3:08 PM IST

Withdraw Loan From Ppf : దేశంలో చిన్న పొదుపులను పెట్టుబడి రూపంలో సమీకరించే లక్ష్యంతో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) 1968లో ఏర్పాటైంది. దీనిని సేవింగ్స్‌-కమ్‌-టాక్స్‌ సేవింగ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అని కూడా పిలుస్తారు. ఇది వార్షిక పన్నులను ఆదా చేస్తూ పదవీ విరమణ నిధిని నిర్మించడానికి వీలు కల్పిస్తుంది. పన్నులను ఆదా చేయడానికి, హామీతో కూడిన రాబడిని సంపాదించడానికి సురక్షితమైన పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్న ఎవరైనా పీపీఎఫ్‌ ఖాతాను తెరవొచ్చు.

PPF ఖాతా ఎలా తెరవాలి?
18 సంవత్సరాలు నిండిన భారత పౌరులు ఎవరైనా పోస్టాఫీసు, ఎస్‌బీఐ లేదా ఏదైనా జాతీయ బ్యాంకులో ఈ ఖాతాను తెరవొచ్చు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు వంటి కొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల్లో కూడా ఖాతాను తెరవొచ్చు. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెరవాలి. ఉమ్మడి ఖాతా సౌకర్యం లేదు. కానీ మైనర్‌ పేరు మీద ఒక ఖాతాను తెరిచే అవకాశం ఉంది. పీపీఎఫ్‌ ఖాతాను తెరిచేటప్పుడు ఖాతాదారుని పాన్‌, ఆధార్‌, ఓటర్‌ ఐడీ, లేటెస్ట్‌ పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో, పూర్తి చేసిన దరఖాస్తు అవసరం ఉంటుంది.

మైనర్‌ దరఖాస్తు అయితే పై పత్రాలే కాకుండా, జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల కేవైసీ వివరాలు మొదలైనవి కావాలి. నామినీ డిక్లరేషన్‌ ఫారం కూడా ఇవ్వాలి. రూ.100తో ఖాతాను తెరవొచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనిష్ఠ డిపాజిట్‌గా రూ.500, గరిష్ఠ డిపాజిట్‌గా రూ.1.50 లక్షల వరకు చేయొచ్చు. పెట్టుబడిని ఒకేసారి లేదా గరిష్ఠంగా 12 వాయిదాలలో చెల్లించొచ్చు. డిపాజిట్‌ను నగదు, చెక్కు, డీడీ లేదా ఆన్‌లైన్‌ ఫండ్‌ బదిలీ ద్వారా చేయొచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ కాలవ్యవధి 15 ఏళ్లు. ప్రస్తుతం ఏడాదికి 7.10% వడ్డీ లభిస్తుంది.

మధ్యలో డబ్బులు అవసరమైతే?
ఈ ఖాతాలో ఉన్న డబ్బును 15 ఏళ్ల లోపు ఉపసంహరించుకోవాలనుకుంటే ఖాతా 5 ఏళ్లు పూర్తయిన తర్వాత.. విద్య, అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఖాతా నిల్వలో 50% ఉపసంహరించుకోవచ్చు. ఖాతా 6 ఏళ్లు పూర్తయిన తర్వాత.. 7వ సంవత్సరం నుంచి కూడా నిల్వ మొత్తంలో పాక్షికంగా తీసుకోవచ్చు. ఈ ఉప‌సంహ‌ర‌ణ మొత్తం మీ పీపీఎఫ్ ఖాతాలో 4వ సంవత్సరం చివ‌రిలో ఉన్న న‌గ‌దు నిల్వలో 50% లేదా అంత‌కు ముందు సంవత్సరం చివ‌రిలో 50% న‌గ‌దు నిల్వలో (ఏది త‌క్కువైతే అది) మాత్రమే ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఏడాదికోసారి మాత్రమే ఉప‌సంహ‌ర‌ణ‌కు వీలుంటుంది.

పాక్షికంగా లేదా పూర్తిగా ఉపసంహరించుకోవాలంటే.. సంబంధిత సమాచారంతో ఫారం-సిని ఉపయోగించి దరఖాస్తు ఫారంను పూరించాలి. మీ పీపీఎఫ్‌ ఖాతా ఉన్న సంబంధిత కార్యాలయంలో దరఖాస్తును సమర్పించాలి. ఈ ఫారంతో పాటు పీపీఎఫ్‌ పాస్‌బుక్‌ కాపీని జత చేయాలి. ఫారం-సి డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు.

ఈ ఫారంలో 3 విభాగాలు ఉంటాయి

  • సెక్షన్‌ 1: డిక్లరేషన్‌ సెక్షన్‌లో మీరు తప్పనిసరిగా మీ పీపీఎఫ్‌ ఖాతా నంబర్‌, ఉపసంహరించుకొనే నగదు మొత్తాన్ని పేర్కొనాలి. దాంతో పాటు, మొదట ఖాతా తెరిచి ఎన్ని సంవత్సరాలు గడిచిందో కూడా పేర్కొనాలి.
  • సెక్షన్‌ 2: ఆఫీసు వినియోగ విభాగం వంటి వివరాలు ఉంటాయి.
  • సెక్షన్‌ 3: డబ్బు జమ చేయాల్సిన బ్యాంకు లేదా చెక్కు, డీడీ జారీ చేయాల్సిన వివరాలు.

పీపీఎఫ్‌పై రుణం
మీరు 3-6వ సంవత్సరం మధ్య మీ పీపీఎఫ్‌ ఖాతాపై రుణం తీసుకోవచ్చు. ఉదా: మీరు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాను తెరిస్తే, 2024-25లో మీ డిపాజిట్‌పై రుణం తీసుకోవ‌చ్చు. రెండో ఆర్ధిక సంవత్సరంలో ఉన్న ఖాతా బ్యాలన్స్ పై మొత్తంపై 25% వ‌ర‌కు గరిష్ఠంగా రుణం తీసుకోవచ్చు. మొదటి రుణం పూర్తిగా చెల్లించినట్లయితే 6వ సంవత్సరానికి ముందు రెండో రుణం తీసుకోవచ్చు. మీరు పీపీఎఫ్‌పై పొందే వడ్డీ ఆదాయానికి 1% వడ్డీ ఎక్కువ ఉంటుంది.

రుణం తీసుకున్న నెల మొదటి రోజు నుంచి రుణం తిరిగి చెల్లించిన నెల చివరి రోజు వరకు రుణ మొత్తంపై వడ్డీ లెక్కిస్తారు. ఉదా: మీరు 2022 జూన్‌ 20న పీపీఎఫ్‌ ఖాతాపై రుణం తీసుకుని, దానిని 2022 అక్టోబర్‌ 12న తిరిగి చెల్లిస్తే.. 2022 జూన్‌ 1 తేదీ నుంచి 2022 అక్టోబర్‌ 31వ తేదీ వరకు వడ్డీ వసూలు చేస్తారు. రుణ చెల్లింపునకు వ్యవధి గరిష్ఠంగా 36 నెలలు.

మెచ్యూరిటీకి ముందే పీపీఎఫ్ మూసివేత
5వ సంవత్సరం పూర్తయిన త‌ర్వాత.. ఖాతాదారే కాకుండా జీవిత భాగ‌స్వామి, పిల్లలు, త‌ల్లిదండ్రులకు ఏదైనా ప్రాణాంత‌క వ్యాధి ఉన్నట్టు నిర్ధార‌ణ అయినా (లేక‌) ఖాతాదారు ఉన్నత విద్య ఖ‌ర్చుల‌కు.. ఫారం-సితో పాటు, అత్యవసర సంఘ‌ట‌న రుజువు ప‌త్రాలు స‌మ‌ర్పించి మెచ్యూరిటీకి ముందే పీపీఎఫ్‌లో ఉన్న న‌గ‌దు మొత్తం ఉప‌సంహ‌రించుకొని ఖాతా మూసేయొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.