Upcoming Cars In India 2024 : భారతదేశంలో నేడు కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ లేటెస్ట్ కార్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా హోండా, హ్యుందాయ్, కియా, మహీంద్రా, టాటా, మారుతి సుజుకి కంపెనీలు తమ సరికొత్త ఎస్యూవీ, హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లను 2024లో లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Hyundai Creta Facelift Features :
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారును 2024 మార్చిలో లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిలో సరికొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ కారు ఇంటీరియర్, ఎక్స్టీరియర్లో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా క్యాబిన్లో ఆధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త ఫీచర్లు పొందుపరిచారు. అలాగే సెన్సుయస్ స్పోర్టినెస్ ఫిలాసఫీతో కారు అవుట్‌లుక్‌ను తీర్చిదిద్దారు.
![Hyundai Creta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_hyundai-creta-1.jpg)
![Hyundai Creta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_hyundai-creta.jpg)
![Hyundai Creta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_hyundai-creta-2.jpg)
![Hyundai Creta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_hyundai-creta-3.jpg)
![Hyundai Creta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_hyundai-creta-4.jpg)
![Hyundai Creta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_hyundai-creta-5.jpg)
Kia Sonet Facelift Features :
కియా కంపెనీ కూడా 2024లో సోనెట్ కారును ఇండియాలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కియా సోనెట్ కారు 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
ఈ నయా కారు ముందు భాగంలో, క్యాబిన్లో సరికొత్త మార్పులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్యూవీ కారు సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా.. కియా కంపెనీ ఈ కారు లోపలి భాగంలో (ఇంటీరియర్) సరికొత్త పరికరాలను, టెక్ ఫీచర్లను పొందుపరుస్తోంది.
![Kia Sonet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_kia-sonet.jpg)
![Kia Sonet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_kia-sonet-3.png)
![Kia Sonet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_mahindra-xuv300.png)
![kia sonet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_kia-sonet-2.png)
Mahindra XUV300 Facelift Features :
మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారును 2024లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు డిజైన్‌ను.. మహీంద్రా ఎక్స్‌యూవీ 700, అప్‌కమింగ్ బీఈ రేంజ్ కార్ల డిజైన్ల ప్రేరణతో రూపొందించడం జరిగింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారు లోపల పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, న్యూ క్లస్టర్ అమర్చారు. మొత్తంగా చూసుకుంటే ప్రీమియం క్వాలిటీ సర్ఫేస్ మెటీరియల్స్, ట్రిమ్స్‌తో రూపొందించిన ఈ కారు లుక్ సూపర్‌గా ఉంటుంది.
Tata Punch EV Features :
ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 2024లో టాటా పంచ్ ఈవీని లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారును Ziptron సాంకేతికతతో రూపొందించడం జరిగింది.
ఇటీవలే టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీని విడుదల చేసింది. త్వరలోనే పంచ్ ఈవీని కూడా లాంఛ్ చేయనుంది. వాస్తవానికి ఈ టాటా పంచ్ ఈవీలోని ఇంటీరియర్.. నెక్సాన్ ఈవీతో అనేక సారూప్యతలను కలిగి ఉంటుందని అంచనా. అయితే ఎక్స్టీరియర్ విషయంలోనే మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం.
![Tata Punch EV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_tata-punch-1.jpg)
![Tata Punch EV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_tata-punch-2.jpg)
![Tata Punch EV](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_tata-punch.jpg)
New Gen Maruti Suzuki Swift Features :
ఇండియన్ కార్ మేకర్ మారుతి సుజుకి 2023 జపాన్ మొబిలిటీ షోలో తన సరికొత్త స్విఫ్ట్ కారును పరిచయం చేసింది. దీనిని 2024లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో న్యూ జెడ్ సిరీస్ మైల్డ్ హైబ్రీడ్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారని.. ఇది MT లేదా CVT అనుసంధానం కలిగి ఉందని సమాచారం.
మారుతి సుజుకి కంపెనీ ఈ స్విఫ్ట్ కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌లో అనేక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
New Gen Honda Amaze Features :
హోండా కంపెనీ 2018లో హోండా అమేజ్ కారును లాంఛ్ చేసింది. 2021లో మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌కు అప్‌గ్రేడ్ అయ్యింది. అయితే థర్డ్ జనరేషన్ కాంపాక్డ్ సెడాన్ 2024లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ హోండా అమేజ్ కారులో 1.2 లీటర్ i-VTEC ఇంజిన్ ఉంటుంది. ఇది 90 bhp పవర్, 110 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే ఇండియన్ మార్కెట్ డీజిల్ ఇంజిన్ కారు మాత్రం అందుబాటులో ఉండదు.
![Honda Amaze](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_honda-amaze-1.png)
![Honda Amaze](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_honda-amaze.png)
![Honda Amaze](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_honda-amaze-2.png)
![Honda Amaze](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-11-2023/20037834_honda-amaze-3.png)
Honda New Compact SUV Features :
భారత్‌లో 2030లోపు 5 ఎస్యూవీ కార్లను లాంఛ్ చేయాలని హోండా కంపెనీ ఒక లక్ష్యం పెట్టుకుంది. అందులో భాగంగా 2024లో హోండా న్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ జపాన్ ఆటోమొబైల్ కంపెనీ ఇటీవలే హోండా ఎలివేట్ కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నాలుగు ఎస్‌యూవీలు లైన్లో ఉన్నాయి.