ETV Bharat / business

సచిన్​,​ కోహ్లీ, రాహుల్​కు ట్విట్టర్​ బ్లూటిక్ బ్యాక్​.. డబ్బులు కట్టారా..? - ట్విట్టర్ బ్లూటిక్​ మలాలా యూసఫ్​జాయ్

ట్విట్టర్​ సంస్థను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి టెక్​ దిగ్గజం ఎలాన్​ మస్క్.. రోజుకో మార్పుతో సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవలే సబ్​స్క్రిప్షన్​ ఛార్జీలు చెల్లించని వారి ట్విట్టర్​ బ్లూటిక్​లు ​తొలగించారు. తాజాగా కొంతమందికి వాటిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

twitter blue tick back
twitter blue tick back
author img

By

Published : Apr 23, 2023, 3:16 PM IST

Updated : Apr 23, 2023, 3:39 PM IST

ట్విట్టర్​ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌.. రోజుకో మార్పుతో వినియోగదారులకు షాకిస్తూనే ఉన్నారు. ట్విట్టర్​ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు చెల్లించని వారికి ఇటీవల బ్లూటిక్‌లు తొలగించిన సంస్థ.. తాజాగా కొంతమందికి పునరుద్ధరించింది. ఈ బ్లూటిక్​లపై ట్విట్టర్ అధికారికంగా స్పందించనప్పటికీ.. 10 లక్షల ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు బ్లూటిక్‌లను తిరిగి ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి.

సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించని సెలబ్రిటీలు, ప్రముఖులకు ఇటీవల బ్లూటిక్‌లను ట్విట్టర్​ తొలగించింది. వీరిలో మనదేశానికి చెందిన షారుక్​ ఖాన్​, సల్మాన్​ ఖాన్​, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రముఖ క్రికెటర్​ విరాట్​ కోహ్లీ లాంటి.. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. అయితే ఈ బ్లూటిక్‌ల కోసం వారు డబ్బులు చెల్లించారా లేదా అన్నది తెలియలేదు. ఇదే సమయంలో ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సేకు 65 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ బ్లూటిక్ ఇవ్వకపోవడం గమనార్హం.

మరోవైపు ట్విట్టర్​ బ్లూటిక్ పునరుద్ధరణపై నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్​జాయ్​ సంతోషం వ్యక్తం చేశారు. 'ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నా బ్లూటిక్ తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది." అని ఆమె ట్వీట్ చేశారు. వీరితో పాటు చాడ్విక్ బోస్‌మన్, కోబ్ బ్రయంట్, మైఖేల్ జాక్సన్ లాంటి కొందరు ప్రపంచ ప్రముఖుల ఖాతాలకు కూడా బ్లూ టిక్‌ను పునరుద్ధరించారు. ఇక, అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్, యూఎస్​ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్, లెజెండరీ నటుడు విలియం షాట్నర్‌లతో సహా కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తుల ఖాతాలకు.. తాను వ్యక్తిగతంగా సబ్​ష్క్రిప్షన్​ ఛార్జీలు చెల్లిస్తానని మస్క్ ప్రకటించారు. అందులో భాగంగా వారి బ్లూటిక్‌లను కొనసాగించారు.

ఇండియాలో బ్లూటిక్​ ఛార్జీలు..
ఇండియాలో బ్లూటిక్​ ధర నెలకు రూ.900 (ఐఓఎస్​ & ఆండ్రాయిడ్​ వినియోగదారులకు).. సంవత్సరానికి రూ. 9,400 చెల్లించాలి. ఇక, వెబ్ యూజర్లైతే నెలకు రూ.650.. సంవత్సరానికి రూ. 6,800 సబ్​ష్క్రప్షన్​ ఛార్జీలు చెల్లించాలి.

లోగోను మార్చిన మస్క్​
ఈ బ్లూటిక్​ తొలగింపుల కంటే ముందు ఎలాన్​ మస్క్​.. ట్విట్టర్​ లోగోనే మార్చేశారు. డోజ్​ మీమ్​ను లోగోగా పెట్టారు. అది ట్విట్టర్​ డెస్క్​టాప్​ వర్షన్​లో దర్శనమిచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ బ్లూబర్డ్​ లోగోను పునరుద్ధరించారు. వ్యయ నియంత్రణ, ట్విట్టర్ అభివృద్ధి లాంటి సాకులతో అంతకుముందు సంస్థలో భారీగా ఉగ్యోగాలకు కోత విధించారు.

Last Updated : Apr 23, 2023, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.