Top 10 Bikes Under 2 Lakh For College Students : బైక్స్ అంటే ఇష్టపడని యువకులు ఉండరు. కాలేజ్ విద్యార్థులైతే ఇంక చెప్పాల్సిన పనే లేదు. మంచి స్టైలిష్ లుక్స్‌తో, సూపర్ మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలని కాలేజ్ విద్యార్థులు ఆశపడుతూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీలు అన్నీ తక్కువ బడ్జెట్లో స్టన్నింగ్ డిజైన్స్‌తో బైక్స్ రూపొందించి మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్-10 బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. KTM Duke 200 Features :
- ఇంజిన్ - 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
- పవర్ - 25 bhp@ 10,000 rpm
- టార్క్ - 19.3 Nm@ 8000 rpm
- ట్రాన్స్మిషన్ - 6 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 35 కి.మీ/ లీటర్
KTM Duke 200 Price : ఈ కేటీఎం డ్యూక్ 200 బైక్ ధర ఆయా వేరియంట్లను అనుసరించి రూ.1.76 లక్షల నుంచి రూ.1.94 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంటుంది.

2. KTM Duke 125 Features :
- ఇంజిన్ - 124.7 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
- పవర్ - 14.30 bhp@ 9,250 rpm
- టార్క్ - 12 Nm@ 8000 rpm
- ట్రాన్స్మిషన్ - 6 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 40 కి.మీ/ లీటర్
KTM Duke 125 Price : ఈ కేటీఎం డ్యూక్ 125 బైక్ ధర ఆయా వేరియంట్లను అనుసరించి రూ.1.41 లక్షల నుంచి రూ.3.4 లక్షల వరకు ఉంటుంది.

3. Bajaj Pulsar NS 200 Features :
- ఇంజిన్ - 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
- పవర్ - 23.2 bhp@ 9750 rpm
- టార్క్ - 18.74 Nm@ 8000 rpm
- ట్రాన్స్మిషన్ - 6 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 35 కి.మీ/ లీటర్
Bajaj Pulsar NS 200 Price : ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధర ఆయా వేరియంట్లను అనుసరించి రూ.1.26 లక్షలు నుంచి రూ.1.54 లక్షలు వరకు ఉంటుంది.

4. Bajaj Dominar 250 Features :
- ఇంజిన్ - 248.8 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
- పవర్ - 26.63 bhp@ 8550 rpm
- టార్క్ - 23.5 Nm@ 6500 rpm
- ట్రాన్స్మిషన్ - 6 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 35 కి.మీ/ లీటర్
Bajaj Dominar 250 Price : ఈ బజాజ్ డోమినార్ 250 బైక్ ధర సుమారుగా రూ.1.85 లక్షలు ఉంటుంది.
5. Bajaj Pulsar F250 Features :
- ఇంజిన్ - 249 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
- పవర్ - 24.1 bhp@ 8750 rpm
- టార్క్ - 21.5 Nm@ 6500 rpm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 35 కి.మీ/ లీటర్
Bajaj Pulsar F250 Price : ఈ బజాజ్ పల్సర్ ఎఫ్250 బైక్ ధర సుమారుగా రూ.1.44 లక్షల నుంచి రూ.1.50 లక్షలు వరకు ఉంటుంది.
6. Bajaj Pulsar N250 Features :
- ఇంజిన్ - 249 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
- పవర్ - 24.1 bhp@ 8750 rpm
- టార్క్ - 21.5 Nm@ 6500 rpm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 35 కి.మీ/ లీటర్
Bajaj Pulsar N250 Price : ఈ బజాజ్ పల్సర్ ఎన్250 బైక్ ధర సుమారుగా రూ.1.38 లక్షల నుంచి రూ.1.54 లక్షలు వరకు ఉంటుంది.
7. Royal Enfield Hunter 350 Features :
- ఇంజిన్ - 349 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
- పవర్ - 20.2 bhp@ 6,100 rpm
- టార్క్ - 27 Nm@ 4000 rpm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 36.2 కి.మీ/ లీటర్
Royal Enfield Hunter 350 Price : ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ ధర రూ.1.49 లక్షలు నుంచి రూ.1.68 లక్షలు వరకు ఉంటుంది.

8. Royal Enfield Classic 350 Features :
- ఇంజిన్ - 349 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
- పవర్ - 20.2 bhp@ 6,100 rpm
- టార్క్ - 27 Nm@ 4000 rpm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 35 -37 కి.మీ/ లీటర్
Royal Enfield Classic 350 Price : ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధర రూ.1.52 లక్షల నుంచి రూ.2.25 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంటుంది.

9. TVS Ronin Features :
- ఇంజిన్ - 225.9 సీసీ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
- పవర్ - 20.1 bhp@ 7750 rpm
- టార్క్ - 19.93 Nm@3750
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 30 కి.మీ/ లీటర్
TVS Ronin Price : టీవీఎస్ రోనిన్ బైక్ ధర రూ.1.49 లక్షల నుంచి రూ.1.69 లక్షల వరకు ఉంటుంది.

10. Yamaha R15 V4 Features :
- ఇంజిన్ - 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్
- పవర్ - 18.1 bhp@ 10,000 rpm
- టార్క్ - 14.2 Nm@ 7500
- ట్రాన్స్మిషన్ - 6 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 45 -50 కి.మీ/ లీటర్
Yamaha R15 V4 Price : ఈ యమహా ఆర్15 వీ4 బైక్ ధర రూ.1.81 లక్షల నుంచి రూ.1.97 లక్షల వరకు ఉంటుంది.
లేడీస్ స్పెషల్ - రూ.1 లక్ష బడ్జెట్లో ఉన్న టాప్-5 స్కూటీలు ఇవే!