ETV Bharat / business

TCS CEO Salary : టీసీఎస్​ సీఈఓ వేతనం రూ.29.16 కోట్లు.. మిగిలిన బిగ్ బాస్​లది ఎంతో తెలుసా?

author img

By

Published : Jun 9, 2023, 5:46 PM IST

TCS Salaries : ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్..​ సీఈఓ సహా ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్​ల ఆదాయాల వివరాలు వెల్లడయ్యాయి. టీసీఎస్​ మాజీ సీఈఓ రాజేశ్​ గోపీనాథన్​ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.29.16 కోట్లు ఆర్జించారు. మరోవైపు ఇన్ఫోసిస్​ సీఈఓ ఆర్జన మాత్రం 29.3 శాతం తగ్గి రూ.56.4 కోట్లకు చేరుకుంది.

TCS SALARIES
IT giant TCS top executives earnings in fiscal year 2023

TCS CEO Salary 2023 : ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) మాజీ సీఈఓ రాజేశ్​ గోపీనాథన్​ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.29.16 కోట్లు ఆర్జించారు. గతేడాది 2022తో పోల్చితే ఆయన సంపాదన 13.17 శాతం పెరిగిందని టీసీఎస్​ తన వార్షిక నివేదికలో​ పేర్కొంది. రాజేశ్​ గోపీనాథన్​ కాంపెన్సేషన్​ 2022 సంవత్సరంలో 26.6 శాతం పెరిగింది.

TCS top executives salaries :
భారత దేశంలోనే ఐటీ రంగంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓల్లో రాజేశ్​ గోపీనాథన్​ 5వ వారు. ఈయన బేసిక్​ శాలరీ రూ.1.7కోట్లు. కానీ కంపెన్​సేషన్​గా 25.75 కోట్లుగా తీసుకుంటున్నారు. రాజేశ్​ గోపీనాథన్​ ఈ సెప్టెంబర్​ 16 వరకు టీసీఎస్​ సలహాదారుగా కొనసాగనున్నారు. గోపీనాథన్​ టీసీఎస్​లో 22 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఎన్​ చంద్రశేఖరన్​ టీసీఎస్​ ఛైర్మన్​ అయిన తరువాత, 2017లో గోపీనాథన్​ టీసీఎస్​ సీఈఓ బాధ్యతలు స్వీకరించారు.

ఈ నెల మొదట్లో టీసీఎస్​ సీఈఓగా కె కృతివాసన్​ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటీ కాన్పుర్​లో చదువుకున్న కృతివాసన్​ టీసీఎస్​లో ముప్పై సంవత్సరాలకు పైగా వివిధ పదవుల్లో పనిచేశారు. ముఖ్యంగా ప్రెసిడెంట్​, గ్లోబల్​ హెడ్​ ఆఫ్​ బ్యాంకింగ్​, ఫైనాన్సియల్​ సర్వీసెస్​ అండ్​ ఇన్సూరెన్స్​గా పనిచేశారు. ప్రస్తుతం టీసీఎస్​ సీఈఓగా కృతివాసన్​ నెలకు రూ.10 లక్షలు బేసిక్​ శాలరీగా తీసుకుంటున్నారని ఆ సంస్థ​ వెల్లడించింది. ఇది రూ.16 లక్షల వరకు చేరుకోవచ్చని, అలాగే ఇతర ప్రయోజనాలు కూడా ఆయనకు అందుతాయని స్పష్టం చేసింది.

టీసీఎస్​ COO NG సుబ్రహ్మణ్యం 2023 సంవత్సరంలో రూ.23.59 కోట్లు ఆర్జించారు. ఇది 2022 సంవత్సరంలో 18 శాతం పెరిగితే, ఈ ఏడాది 14 శాతం వరకు పెరిగిందని ఈ దిగ్గజ ఐటీ కంపెనీ పేర్కొంది. భారతదేశంలో మార్కెట్​ క్యాపిటలైజేషన్​ అలాగే రెవెన్యూల్లోనూ టీసీఎస్​ అగ్రగామిగా కొనసాగుతోంది.

ఇన్ఫోసిస్​ సీఈఓ శాలరీ తగ్గింది!
Infosys CEO Salary : ఒక వైపు టీసీఎస్​ సీఈఓ శాలరీ పెరిగితే.. మరోవైపు ప్రధాన పోటీదారు ఇన్ఫోసిస్​ సీఈఓ సలీల్​ పరేఖ్​ వేతనం బాగా తగ్గింది. గతేడాది ఆయన ఆదాయం 88 శాతం పెరిగి రూ.79.8 కోట్లుగా ఉంది. కానీ 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన సంపాదన 29.3 శాతం తగ్గి రూ.56.4 కోట్లకు చేరుకుంది. వాస్తవానికి ఆయన రెమ్యునరేషన్​లో RSUలకు చెల్లించాల్సిన రూ.30.6 కోట్లు ఉండడం విశేషం. కానీ మరోవైపు ఇన్ఫోసిస్​ ప్రెసిడెంట్​ పదవి నుంచి త్వరలోనే తప్పుకోనున్న మోహిత్​ జోషి ఆదాయం మాత్రం 64.6 శాతం పెరిగి రూ.57.3 కోట్లకు చేరుకుంది. గతేడాది ఈయన సంపాదన కేవలం రూ.34.8కోట్లుగా ఉంది. జోషి ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీకి రాజీనామా చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.