ETV Bharat / business

కరెన్సీ నోట్లపై ఠాగూర్, కలాం చిత్రాలు?.. కొత్త వాటర్​మార్క్​లు రెడీ! - కరెన్సీ నోట్లపై అబ్దుల్ కలాం చిత్రాలు

Tagore Kalam images on currency notes: కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్‌, అబ్దుల్ కలాం చిత్రాలు త్వరలో కనిపించే అవకాశం ఉంది! ఇప్పటివరకు నోట్లపై గాంధీ చిత్రాన్ని ముద్రిస్తున్న రిజర్వు బ్యాంకు.. ఇతర ప్రముఖుల చిత్రాలను సైతం ముద్రించాలని యోచిస్తోంది.

tagore-kalam-images-on-currency-notes-rbi

author img

By

Published : Jun 6, 2022, 9:39 AM IST

Abdul Kalam image currency notes: కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించే అంశాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రం మాత్రమే ఉంటోంది. తొలిసారి ఇతరుల చిత్రాలను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆర్​బీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2017లోనే ఈ ప్రతిపాదన వచ్చినా ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయమై త్వరలోనే ఒక నిర్ణయానికి రావాలని ఆర్​బీఐ భావిస్తున్నట్లు సమాచారం.

Tagore image currency note: ఈ మేరకు కొత్త వాటర్‌మార్కులు ఉన్న నోట్లను ఐఐటీ దిల్లీ గౌరవ ప్రొఫెసర్ దిలీప్ టి.షాహనీకి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయనే గాంధీ, ఠాగూర్, కలాం చిత్రాల్లో ఒకదాన్ని ఎంపిక చేస్తారట! ఆయన సెలెక్ట్ చేసిన నోటును ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్లు సమాచారం. లేదంటే మూడింటినీ పంపుతారు. అయితే వాటిలో దేన్ని ముద్రించాలనే నిర్ణయం అత్యున్నత స్థాయిలో తీసుకుంటారని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.

అమెరికా కరెన్సీ నోట్లపై అనేక మంది ప్రముఖుల చిత్రాలు ఉంటాయి. ఆ విధంగానే మన కరెన్సీపై కూడా గాంధీతో ఇతరుల చిత్రాలు ముద్రించాలని రిజర్వు బ్యాంకు భావిస్తోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.