ETV Bharat / business

ఆవుపేడతో నడిచే కార్లు.. త్వరలో మార్కెట్లలోకి.. సుజుకీ ప్రకటన

ఆవు పేడతో నడిచే CNG కార్లను త్వరలోనే భారత విపణిలోకి తీసుకురానున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ప్రకటించింది. దీని కోసం సుజుకీ.. భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్​ డెయిరీ డెవలప్​మెంట్​ బోర్డ్​, ఆసియాలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు బనాస్ డెయిరీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

Suzuki to use cow dung for its CNG cars
Suzuki to use cow dung for its CNG cars
author img

By

Published : Jan 28, 2023, 4:16 PM IST

Updated : Jan 28, 2023, 5:16 PM IST

దిగ్గజ కార్ల తయారీ సంస్థ సుజుకీ మోటార్​ కార్పొరేషన్ సరికొత్త ఇంధన వ్యూహాన్ని ప్రకటించింది. తమ నుంచి రాబోయే సీఎన్​జీ మోడళ్ల కార్లను నడపడానికి ఆవుపేడతో ఉత్పత్తయ్యే బయోగ్యాస్​ను ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆసియాలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ బనాస్ డెయిరీ, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB)తో సుజుకీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఆవుపేడ నుంచి బయోగ్యాస్ తయారుచేసే జపాన్​కు చెందిన ఫుజిసాన్ అసగిరి బయోమాస్‌లోనూ పెట్టుబడి పెట్టినట్లు సుజుకీ తన 2030 ప్రణాళికలో పేర్కొంది.

"భారతీయ మార్కెట్​ 2030 ఆర్థిక సంవత్సరం వైపు దూసుకెళ్తోంది. అదే తరహాలో వివిధ ఉత్పత్తుల నుంచి కార్బన్​ డైఆక్సైడ్ ఉద్గారాలు ​తగ్గినప్పటికీ.. మొత్తంగా CO2 ఉద్గారాలు పెరుగుతున్నాయి. కార్ల అమ్మకాలు, CO2 ఉద్గారాలను తగ్గించడం మధ్య సమతుల్యత ఉండాలని భావిస్తున్నాం" అని సుజుకీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆవుపేడ, బయోగ్యాస్​ గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా లభిస్తుంది. దీనికి అధునాతను సాంకేతికత జోడిస్తే కర్బణ ఉద్గారాలు చాలా మేరకు తగ్గే అవకాశముంది. అందులో భాగంగానే సుజుకీ.. నేషనల్​ డెయిరీ అభివృద్ధి బోర్డు, ఆసియాలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ బనాస్​ డెయిరీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బయోగ్యాస్​ను ఇండియా, జపాన్​తో పాటు ఆసియాన్(ASEAN)​ దేశాలు, ఆఫ్రికా దేశాల్లో కూడా ఉపయోగించనున్నట్లు తెలిపింది.

ఈ సాంకేతికతల కోసం సుజుకీ ప్రధాన కార్యాలయం, యోకోహామా ల్యాబ్, భారత్​లోని సుజుకీ పరిశోధన, అభివృద్ధి సెంటర్ ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి తోడ్పడతాయని సంస్థ తెలిపింది. ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధికి 2 ట్రిలియన్​ యెన్​లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపింది. మూలధన వ్యయంగా 2.5 ట్రిలియన్​ యెన్​లను పెట్టుబడులుగా పెట్టబోతున్నట్లు వెల్లడించింది. మొత్తంగా 2030 ఆర్థిక సంవత్సరం లోపు 4.5 ట్రిలియన్​ యెన్​లను ఖర్చు చేయబోతుంది. ఇందులో 2 ట్రిలియన్ యెన్లు విద్యుదీకరణ-సంబంధిత పెట్టుబడులు, 500 బిలియన్ యెన్లు బ్యాటరీ సంబంధిత పెట్టుబడులు అని సంస్థ పేర్కొంది.

ఇవీ చదవండి :

నిర్మలమ్మ బడ్జెట్..​ పారిశ్రామిక రంగానికి ఊతమందించేనా..? ఆర్థిక వృద్ధికి చుక్కాని అవుతుందా?

ఇలా చేస్తే ఉద్యోగం వీడాల్సి వచ్చినా ఆర్థికంగా సేఫ్​!

Last Updated : Jan 28, 2023, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.