ETV Bharat / business

భారీ లాభాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు - సెన్సెక్స్​ & నిఫ్టీ ఆల్​ టైమ్ హై రికార్డ్​!

Stock Market Today 15th December 2023 In Telugu : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 71,483 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 21,456 వద్ద ముగిసింది. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్​@71,605; నిఫ్టీ@21,492 వద్ద ఆల్​టైమ్​ హై రికార్డ్​ను నమోదు చేశాయి.

share market today 15th December 2023
stock market today 15th December 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 9:51 AM IST

Updated : Dec 15, 2023, 4:33 PM IST

Stock Market Close : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్​@71,605 వద్ద; నిఫ్టీ@21,492 వద్ద ఆల్​టైమ్​ హై రికార్డ్​ను నమోదు చేశాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, విదేశీ పెట్టుబడులు పెరగడం సహా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. ఆర్​బీఐ ఈ ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి అంచనాలను పెంచడం కూడా మార్కెట్ సెంటిమెంట్​ను బలపరిచింది.

చివరికి బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 969 పాయింట్లు లాభపడి 71,483 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 273 పాయింట్లు వృద్ధి చెంది 21,456 వద్ద ముగిసింది.

లాభపడిన స్టాక్స్​ : హెచ్​సీఎల్ టెక్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, ఎస్​బీఐ, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, టెక్​ మహీంద్రా, విప్రో, పవర్​గ్రిడ్​, ఏసియన్ పెయింట్స్​

నష్టపోయిన షేర్స్​ : నెస్లే ఇండియా, భారతీ ఎయిర్​టెల్​, మారుతి సుజుకి, ఐటీసీ, కోటక్ బ్యాంక్​, యాక్సిస్ బ్యాంక్​

ఐటీ సెక్టార్​ లాభాల పంట
శుక్రవారం ఐటీ, టెక్, మెటల్​ షేర్లు భారీగా లాభపడ్డాయి. హెచ్​సీఎల్​ టెక్నాలజీ ఏకంగా 5.58 శాతం మేర లాభపడింది. టీసీఎస్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్రా కూడా మంచి లాభాలు గడించాయి.

పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతదేశానికి తమ పెట్టుబడులను మళ్లిస్తూనే ఉన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్​ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత మదుపరులు గురువారం రోజు ఏకంగా రూ.3,570 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లు
శుక్రవారం ఆసియా మార్కెట్లైన సియోల్, టోక్యో, హాంకాంగ్​ మంచి లాభాలతో ముగిశాయి. షాంఘై మాత్రం నష్టాలతో ముగిసింది. యూరోపియన్ మార్కెట్లు ప్రస్తుతానికి మిక్స్​డ్ ట్రెండ్​లో కొనసాగుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.33 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 76.86 డాలర్లుగా ఉంది.

  • 3.25 PM
    Stock Market Update : బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం​ 1064 పాయింట్లు లాభపడి 71,605 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 302 పాయింట్లు వృద్ధి చెంది 21,492 వద్ద కొనసాగుతోంది.
  • 3.04 PM
    Stock Market Update : బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం​ 870 పాయింట్లు లాభపడి 71,442 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 247 పాయింట్లు వృద్ధి చెంది 21,451 వద్ద కొనసాగుతోంది.
  • 2:32 PM
    Stock Market Update : బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం​ 531 పాయింట్లు లాభపడి 71,171 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 165 పాయింట్లు వృద్ధి చెంది 21,365 వద్ద కొనసాగుతోంది.
  • 9:30 AM
    Stock Market Today 15th December 2023 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 71,021 లెవెల్​ వద్ద; నిఫ్టీ 21,335 వద్ద ఆల్​ టైమ్ హై రికార్డ్​లను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం సహా, యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు కూడా ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం​ 507 పాయింట్లు లాభపడి 71,021 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 152 పాయింట్లు వృద్ధి చెంది 21,335 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఇన్ఫోసిస్​, టాటా స్టీల్​, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, టాటా మోటార్స్, సన్​ఫార్మా, పవర్​గ్రిడ్​

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : నెస్లే ఇండియా, యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు
FII Investments In India : విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా మదుపరుల సెంటిమెంట్​ను బలపరుస్తోంది. ఎక్స్ఛేంజ్​ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) ఏకంగా రూ.3,570 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు చేశారు. ఇది కూడా దేశీయ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది.

ఏసియన్ మార్కెట్లు
Asian Markets Today 15th December 2023 : శుక్రవారం ఏసియన్ మార్కెట్లైన సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్.. అన్నీ మంచి లాభాలతో ట్రేడవుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు కూడా మంచి లాభాలతోనే ముగిశాయి. ఇవన్నీ దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయి.

రూపాయి విలువ
Rupee Open 15th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.30గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices 15th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.55 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 77.03 డాలర్లుగా ఉంది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు - ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

డెబిట్ కార్డ్​తో ఫ్రీగా ఇన్సూరెన్స్​ కవరేజ్​! ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే?

Last Updated : Dec 15, 2023, 4:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.